Share News

Amit Shah: 2 రోజుల్లో 258 మంది నక్సల్స్‌ లొంగిపోయారు

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:40 AM

గడచిన రెండు రోజుల్లో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు.

Amit Shah:  2 రోజుల్లో 258 మంది నక్సల్స్‌ లొంగిపోయారు

  • మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి: అమిత్‌ షా

న్యూఢిల్లీ, అక్టోబరు 16: గడచిన రెండు రోజుల్లో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఛత్తీ్‌సగఢ్‌లో గురువారం 170 మంది, అంతకు ముందు రోజు 27 మంది, మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారని తెలిపారు. నక్సలిజంపై పోరులో ఇది భారీ విజయమన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు సహా భారీ సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోతున్న నేపథ్యంలో షా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టి తాజా పరిస్థితులను వివరించారు. ఛత్తీ్‌సగఢ్‌లోని అబూజ్‌మడ్‌, ఉత్తర బస్తర్‌ ప్రాంతాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయని ప్రకటించేందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం దక్షిణ బస్తర్‌కు మాత్రమే పరిమితమైందని, వారిని భద్రతా బలగాలు త్వరలోనే తుదముట్టిస్తాయని చెప్పారు. మోదీ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని, లొంగిపోయే వారికి స్వాగతం పలుకుతామని, అలా కాకుండా ఆయుధాలు వదిలిపెట్టబోమంటే వారిని భద్రతా బలగాలు తుడిచిపెట్టేస్తాయన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 06:19 AM