Maoists Surrender: 22 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:14 AM
సుకుమా జిల్లాలో 22 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. వారిపై ఉన్న రూ.40.5 లక్షల రివార్డును కూడా అందజేశారు
చర్ల, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో 22 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. లొంగిపోయిన వారు మావోయిస్టు పార్టీలోని పలు కమిటీల్లో పని చేశారని, సుకుమా జిల్లాలో మావోయిస్టులు జరిపిన పలు విధ్వంసకర ఘటనల్లో నిందితులని ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. వీరిపై ఉన్న సుమారు రూ.40లక్షల యాభై వేల రివార్డును వారికే అందజేశామని తెలియజేశారు. కాగా, మావోయిస్టులు ఇప్పటికైనా లొంగిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఇప్పటిదాకా సుకుమా జిల్లాలో సుమారు 76 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ చెప్పారు.