Ganja Seized: ఆంధ్రా నుంచి చెన్నైకి లారీలో
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:34 AM
ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ లారీలో తీసుకొచ్చిన రూ.2 కోట్ల విలువైన గంజాయిని చెన్నై శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్ పోలీసులు పట్టుకున్నారు.
రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
చెన్నై, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ లారీలో తీసుకొచ్చిన రూ.2 కోట్ల విలువైన గంజాయిని చెన్నై శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఉదయం కార్నోడై తనిఖీ కేంద్రం వద్దకు వచ్చిన లారీని పోలీసులు తనిఖీ చేయగా, వెనుకవైపు కిందిభాగంలో కొయ్యలతో ఏర్పాటు చేసిన పెట్టెలాంటి భాగం బయల్పడింది. చిన్నపాటి గదిని తలి పంచేలా ఉన్న ఆ పెట్టెలో తనిఖీ చేయగా 150 బండిళ్లలో 320 కిలోల గంజాయి బయల్పడింది. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకుని, లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు లారీ యజమాని కోసం గాలిస్తున్నారు. కాగా ఆ లారీ నెంబరు నకిలీదని పోలీసుల విచారణలో తెలిసింది.