Share News

Myanmar: మయన్మార్‌ సైబర్‌ నేర కేంద్రాల నుంచి 162 మందికి విముక్తి

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:41 AM

భారత అధికారుల ఒత్తిడితో స్పందించిన మయన్మార్‌ అధికారులు వారిని విడిపించారు. మయన్మార్‌ అధికారులు రక్షించిన వారిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 18 మంది ఉన్నారు.

Myanmar: మయన్మార్‌ సైబర్‌ నేర కేంద్రాల నుంచి 162 మందికి విముక్తి

ఇందులో తెలంగాణ, ఏపీ వారు 18 మంది

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మయన్మార్‌లో సైబర్‌ నేరాలకు పాల్పడే చైనా ముఠాల వద్ద బందీలుగా చిక్కుకున్న 162 మంది భారతీయులకు విముక్తి లభించింది. భారత అధికారుల ఒత్తిడితో స్పందించిన మయన్మార్‌ అధికారులు వారిని విడిపించారు. మయన్మార్‌ అధికారులు రక్షించిన వారిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 18 మంది ఉన్నారు. పెద్ద మొత్తంలో జీతం వచ్చే ఉద్యోగమంటూ ఎర వేసి చైనా సైబర్‌ నేరాల ముఠాలు రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా యువతను తరలిస్తున్నాయి. గోల్డెన్‌ ట్రయాంగిల్‌గా పిలవబడే మయన్మార్‌, లావోస్‌, ధాయ్‌లాండ్‌, కంబోడియాలోని ప్రాంతాల్లో ఉన్న తమ స్థావరాలకు వారిని తీసుకెళ్లి బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్నాయి. గోల్డెన్‌ ట్రయాంగిల్‌ ప్రాంతాల్లో వెయ్యిమందికి పైగా భారతీయ యువకులు బందీలుగా ఉన్నట్టు సమాచారం.


ఇలా ఓ ముఠా వద్ద బందీగా ఉన్న కరీంనగర్‌ జిల్లా రంగాపేటకు చెందిన కొక్కిరాల మధుకర్‌ రెడ్డి.. తమను రక్షించమంటూ ఇటీవల తన కుటుంబసభ్యులకు అతికష్టం మీద ఓ ఆడియో సందేశం పంపాడు. మయన్మార్‌లోని ఓ ప్రాంతంలో తమని బంధించి ఫోన్లు లాక్కోని సైబర్‌ నేరాలు చేయిస్తున్నారని తెలిపాడు. తామున్న ప్రాంతానికి సంబంధించిన లొకేషన్‌ కూడా షేర్‌ చేసి తమను విడిపించేందుకు ప్రయత్నించాలని కోరాడు. అతని కుటుంబసభ్యులు అధికారులను సంప్రదించగా విదేశీ వ్యవహారాల శాఖ అప్రమత్తమైంది. భారత ఎంబసీ వినతితో స్పందించిన మయన్మార్‌ అధికారులు మయన్మార్‌లోని మైవాడీ, మైయింగ్‌ ప్రాంతాల్లో సోదాలు చేసి 162 మందిని విడిపించారు.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 05:41 AM