Bhupendra Patel: గుజరాత్ మంత్రుల సామూహిక రాజీనామా
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:19 AM
గుజరాత్‌లో గురువారం అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.....
నేడు కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం
అహ్మదాబాద్, అక్టోబరు 16: గుజరాత్‌లో గురువారం అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సీఎం భూపేంద్ర పటేల్ మినహా మొత్తం 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నేపఽథ్యంలో కూర్పు సజావుగా సాగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నూతన మంత్రివర్గం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 16 మంది ఉండగా, ఆ సంఖ్యను 26కు పెంచే అవకాశం ఉంది.