Himachal Flash Floods: ఆ తప్పుతో కుటుంబం మొత్తం గల్లంతు.. పాప మాత్రం..
ABN , Publish Date - Jul 06 , 2025 | 01:21 PM
Himachal Flash Floods: వరద నీరు మెల్ల మెల్లగా రమేష్ అనే వ్యక్తి ఇంటిని చుట్టుముడుతూ ఉంది. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహాన్ని దారి మళ్లించాలని కుటుంబసభ్యులు భావించారు. రమేష్, అతడి భార్య రాధ, తల్లి పూర్ణు దేవి ఇంటి బయటకు వచ్చారు.

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. వరద నీటితో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదల భీభత్సం కారణంగా ఇప్పటి వరకు 70కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ మంది గల్లంతు అయ్యారు. గల్లంతయిన వారిలో సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓ ఫ్యామిలీ కూడా ఉంది. వరద నీటిలో కుటుంబసభ్యులందరూ అందరూ కొట్టుకుపోగా.. ఓ చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
జూన్ 30వ తేదీ రాత్రి సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వరద నీరు మెల్ల మెల్లగా రమేష్ అనే వ్యక్తి ఇంటిని చుట్టుముడుతూ ఉంది. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహాన్ని దారి మళ్లించాలని కుటుంబసభ్యులు భావించారు. రమేష్, అతడి భార్య రాధ, తల్లి పూర్ణు దేవి ఇంటి బయటకు వచ్చారు. ఇంట్లో 11 నెలల పాప నిఖిత మాత్రమే ఉంది. కుటుంబసభ్యులు అందరూ నీటిని దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే, వరద ఒక్కసారిగా పెరగటంతో అందరూ కొట్టుకుపోయారు.
ఇంట్లో ఉండటంతో నిఖిత మాత్రం ప్రాణాలతో బయటపడింది. సహాయక చర్యల కోసం ఆ ప్రాంతానికి వచ్చిన ప్రభుత్వ అధికారిణి స్మ్రితిక నేగి పాపను గుర్తించి అక్కున చేర్చుకున్నారు. ప్రస్తుతం పాపకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, వరద నీటిలో కొట్టుకుపోయిన నిఖిత తండ్రి రమేష్ బాడీ దొరికింది. రాధ, పూర్ణు దేవీల కోసం గాలిస్తున్నారు. తండ్రి మరణించాడు. తల్లి, నాన్నమ్మ దొరికితే పాపకు ఎలాంటి భయం ఉండదు. లేదంటే పాప అనాథ అయిపోయింది. భవిష్యత్తు దారుణంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి
వృద్ధుడి బంపర్ ఆఫర్.. పిల్లిని చూసుకుంటే కోట్ల ఆస్తి మీదే..
తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఉపవాసం ఎందుకు చేస్తారు?