Share News

NCC Officer posts : ఆర్మీలో ఎన్‌సీసీ అధికారి పోస్టులు

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:14 AM

ఎన్‌సీసీ అధికారి పోస్టులకు భారత సైన్యం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇండియన్‌ ఆర్మీ ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 58వ కోర్సు ద్వారా అవివాహితులైన

NCC Officer posts : ఆర్మీలో ఎన్‌సీసీ అధికారి పోస్టులు

ఎన్‌సీసీ అధికారి పోస్టులకు భారత సైన్యం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇండియన్‌ ఆర్మీ ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 58వ కోర్సు ద్వారా అవివాహితులైన యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పురుషులకు 70 పోస్టులు, మహిళలకు 6 పోస్టులున్నాయి. ఇందులో 8 పోస్టులను యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు కేటాయించారు. 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసిన వారే ఈ ఉద్యోగాలకు అర్హులు. అలాగే ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌లో కనీసం బీ గ్రేడ్‌ సాధించాలి. ఆర్మీ అమరుల పిల్లలకు సీ సర్టిఫికెట్‌ అవసరం లేదు. అభ్యర్థుల వయసు 2025 జూలై 1 తేదీ నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 15వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం https://joinindianarmy.nic.in/default.aspx వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

Updated Date - Feb 18 , 2025 | 05:14 AM