-
-
Home » Mukhyaamshalu » Breaking News across GLOBE on 27th August 2025 VR
-
BREAKING: దొంగ నమస్కారాలు పెడితే వినాయకుడు క్షమించడు: సీఎం చంద్రబాబు
ABN , First Publish Date - Aug 27 , 2025 | 06:45 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 27, 2025 20:29 IST
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్
కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో 30 మంది చిక్కుకున్నారని వెల్లడి
బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ పంపాలని కోరిన బండి సంజయ్
హెలికాప్టర్ పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులకు రాజ్‌నాథ్ ఆదేశం
వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడి
-
Aug 27, 2025 20:29 IST
కామారెడ్డి: జలదిగ్బంధంలో హౌసింగ్ బోర్డు కౌండిన్య కాలనీ
వరదల్లో చిక్కుకున్న 50మందికి పైగా కాలనీవాసులు
బోట్లలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రెస్క్యూ సిబ్బంది
-
Aug 27, 2025 20:29 IST
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటివారు బీజేపీలో చాలామంది ఉన్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్
పార్టీలో ఏదో ఒకరకంగా ఇబ్బంది పడే ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్
వాళ్లు అందరు బయపడి నోరు విప్పడం లేదు: రాజాసింగ్
ఇప్పటికైనా హైకమాండ్ తెలంగాణ బీజేపీపై దృష్టి పెట్టాలి: రాజాసింగ్
-
Aug 27, 2025 20:29 IST
నిర్మల్ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించిన కలెక్టర్
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 91005 77132 ఏర్పాటు
-
Aug 27, 2025 20:26 IST
విజయవాడ: అలాంటి పాలకులు అప్పుడూ ఉన్నారు: సీఎం చంద్రబాబు
ఇప్పుడు దొంగ నమస్కారాలు పెడితే వినాయకుడు క్షమించడు: సీఎం చంద్రబాబు
వాళ్ల సంగతి చూస్తాడు: సీఎం చంద్రబాబు
భవిష్యత్‌లో ఎలాంటి కష్టాలు లేకుండా చూడాలని కోరుకున్నా: సీఎం చంద్రబాబు
ఖర్చుకు వెనుకాడకుండా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా: చంద్రబాబు
-
Aug 27, 2025 19:30 IST
భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్
హాజరైన సీఎస్, విపత్తుల నిర్వహణశాఖ స్పెషల్ సీఎస్
జిల్లాలకు స్పెషల్ అధికారులుగా సీనియర్ IASలు నియామకం
భారీ వర్షాల పట్ల ప్రభుత్వం అలర్ట్‌గా ఉంది మంత్రి పొంగులేటి
వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించాం: మంత్రి పొంగులేటి
ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి పొంగులేటి
ఎప్పటికప్పుడు జిల్లాల అధికారులతో మానిటరింగ్ చేస్తున్నాం: పొంగులేటి
-
Aug 27, 2025 19:30 IST
కామారెడ్డి: డేంజర్ జోన్‌లో పోచారం ప్రాజెక్ట్
వరద గేట్ల దగ్గర ప్రాజెక్ట్‌కు గండి, ఆందోళనలో రైతులు
పోచారం ప్రాజెక్ట్‌కు లక్షన్నర క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-
Aug 27, 2025 19:30 IST
కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను వణికిస్తున్న భారీ వర్షాలు
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
జలదిగ్బంధంలో కాలనీలు, చెరువులను తలపిస్తున్న రోడ్లు
కామారెడ్డి జిల్లా ఆర్గొండలో అత్యధికంగా 41సెం.మీ. వర్షపాతం
మెదక్ జిల్లా నాగపూర్‌లో 20.88 సెం.మీ. వర్షపాతం నమోదు
భారీ వర్షాలతో రేపు మెదక్, కామారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాలతో తెలంగాణ వర్సిటీ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా
-
Aug 27, 2025 17:12 IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు కేబినెట్ ఆమోదం
బిడ్ దాఖలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్, నైజీరియా సహా ఆసక్తిచూపుతున్న మరో 2 దేశాలు
-
Aug 27, 2025 17:12 IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
2030లో భారత్‌లో కామన్‌వెల్త్ గేమ్స్ బిడ్‌కు ఆమోదముద్ర
కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొననున్న 72 దేశాలు
గేమ్స్ నిర్వహణకు ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం (IOA) అంగీకారం
భారత్ బిడ్ దక్కించుకుంటే అహ్మదాబాద్, భువనేశ్వర్, ఢిల్లీలో ఏదో ఒకచోట కామన్‌వెల్త్ గేమ్స్ జరిగే అవకాశం
-
Aug 27, 2025 17:12 IST
మహారాష్ట్ర: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు
నలుగురు మావోయిస్టులు మృతి
గడ్చిరోలి జిల్లా కోపర్షి అటవీ ప్రాంతంలో ఘటన
మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు
గడ్చిరోలి పోలీసులు, మావోయిస్టుల మధ్య కొనసాగుతోన్న ఎదురుకాల్పులు
-
Aug 27, 2025 15:27 IST
రాజన్నసిరిసిల్ల: గంభీరావుపేటలో భారీ వర్షం
అప్పర్ మానేరు నుంచి దిగువకు భారీగా నీటి విడుదల
మానేరు వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతు
వాగులో చిక్కుకున్న మరో ఐదుగురు రైతులను రక్షించేందుకు అధికారుల యత్నం
-
Aug 27, 2025 15:27 IST
హైదరాబాద్: బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
హిందువుల పండుగలకు పాలిటిక్స్ ముడిపెట్టడం కరెక్ట్ కాదు: పొన్నం
ఓట్ల కోసం బీజేపీ హిందుత్వాన్ని వాడుకుంటోంది: మంత్రి పొన్నం
ఓట్ చోరిపై విచారణ అవసరం: మంత్రి పొన్నం ప్రభాకర్
దొంగ ఓట్లకు బండి సంజయ్ వ్యతిరేకమైతే సీఈసీకి లేఖ రాయాలి: మంత్రి పొన్నం
దొంగ ఓట్లతో బండి సంజయ్ గెలవకపోతే ఎందుకు భయం: మంత్రి పొన్నం
అక్షింతల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి పొన్నం
మతం పేరుతో బీసీ రిజర్వేషన్ల కు బీజేపీ అడ్డుపడుతోంది : మంత్రి పొన్నం
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చి, కేంద్రంలో అవుతోంది: మంత్రి పొన్నం
ఆర్ కృష్ణయ్య ధర్నా చేయడం ఆశ్చర్యంగా ఉంది: మంత్రి పొన్నం
చిన్న అంశాన్ని వాడుకొని మతపరమైన అల్లర్లకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది: మంత్రి పొన్నం
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుపై ఆ పార్టీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఫుడ్ బాల్ వేసాడు: మంత్రి పొన్నం
దీంతో ఏం చేయాలో రాంచందర్ రావు కు అర్థం కావడం లేదు: మంత్రి పొన్నం
బండి సంజయ్ దేవుని పేరు తో గెలిచాడు: మంత్రి పొన్నం
మేధావులు బీజేపీ పెద్దలను నిలదిస్తే బీసీ రిజర్వేషన్లు సాధ్యం అవుతాయి: మంత్రి పొన్నం
రిజర్వేషన్ల పెంపు విషయంలో మా చిత్తశుద్ధిని శంకిచాల్సిన అవసరం లేదు: మంత్రి పొన్నం
ఆర్ కృష్ణయ్య బీజేపీ తాత్కాలిక సభ్యుడా? పర్మినెంట్ సభ్యుడా చెప్పాలి: మంత్రి పొన్నం
కేసీఆర్ బీసీలకు ఉరితాడు వేసే చట్టం చేసాడు: మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ గోడ మీద పిల్లి లా ఉంది: మంత్రి పొన్నం
-
Aug 27, 2025 13:34 IST
రాహుల్ గాంధీ ఇప్పుడే నిద్ర లేచారా?: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ఓట్ చోర్‌తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే కాంగ్రెస్: విశ్వేశ్వర్‌రెడ్డి
ఓట్ల చోరీలో కాంగ్రెస్, BRS కుమ్మక్కు: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
గత ఎన్నికల్లో దొంగఓట్లతోనే కాంగ్రెస్, BRS గెలిచాయి: విశ్వేశ్వర్‌రెడ్డి
రాహుల్ పాదయాత్ర, దొంగే.. దొంగ దొంగ అన్నట్లుంది: విశ్వేశ్వర్‌రెడ్డి
-
Aug 27, 2025 13:05 IST
కామారెడ్డి పెద్దచెరువు ఉధృతితో హౌసింగ్‌బోర్డు కాలనీ జలమయం
నీట మునిగిన ఇళ్ళు, హౌసింగ్ బోర్డ్ బ్రిడ్జ్ మీదుగా పారుతున్న వరద
కౌండిన్యకాలనీలో భారీగా నీరు చేరికతో చిక్కుకున్న 10 మంది కాలనీవాసులు
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కాలనీకి చెందిన 8 కార్లు, 12 బైక్‌లు
కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గాన్ని నిలిపివేసిన పోలీసులు
-
Aug 27, 2025 12:48 IST
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల సందడి
వర్షంలోనూ బడా గణేషుడి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు
శ్రీవిశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడి దర్శనం
69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఖైరతాబాద్ గణేషుడు
ఖైరతాబాద్ గణేషుడికి కుడివైపున శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి
గణేషుడికి ఎడమవైపున ఖైరతాబాద్ గ్రామదేవత గజ్జలమ్మ
-
Aug 27, 2025 12:02 IST
జమ్ములో 30 మంది యాత్రికుల మృతిపై హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, LG సిన్హాకు అమిత్ షా ఫోన్
కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అమిత్ షా హామీ
ఢిల్లీ నుంచి జమ్మూకశ్మీర్ బయల్దేరిన NDRF బృందాలు
రెండు విమానాల ద్వారా సహాయ సామగ్రితో బయల్దేరిన బృందాలు
జమ్ము, ఉధంపూర్, శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ల్లో హెలికాప్టర్లు సిద్ధంచేసిన సైన్యం
-
Aug 27, 2025 11:58 IST
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
జమ్మూకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా..
ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో వర్షాలు
జమ్మూకశ్మీర్‌లో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
ఉధృతంగా ప్రవహిస్తున్న రావి, లిద్దర్, చినాబ్ నదులు
జమ్మూకశ్మీర్‌లో వరద పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా
-
Aug 27, 2025 11:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
పలు కాలనీలను ముంచెత్తిన వరద, ఇళ్లలోకి చేరిన నీరు
కోమటిపల్లి తండా, దామరచెరువు తండాల్లో తెగిన రహదారి
ప్రగతి ధర్మారం, నార్లాపూర్ మధ్య రాకపోకలు బంద్
రామాయంపేట బీసీ కాలనీలో ఇళ్లలోకి చేరిన వరద
రామాయంపేట ఎస్సీ బాలికల గురుకులంలోకి వరదనీరు
రామాయంపేట-కామారెడ్డి మధ్య నిలిచిన రాకపోకలు
నారాయణఖేడ్‌లో ఎడతెరిపిలేని వర్షం
పిట్లం, కంగ్టి గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
-
Aug 27, 2025 10:54 IST
హైదరాబాద్‌లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం
వినాయకచవితి వేడుకలకు ఆటంకంగా మారిన వర్షం
ఎడతెరిపిలేని వర్షంతో బయటికి వెళ్లలేని పరిస్థితి
నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
-
Aug 27, 2025 10:28 IST
హైదరాబాద్: బడా గణేషుడి దర్శనం క్యూలైన్‌లోనే గర్భిణి ప్రసవం
తల్లి, బిడ్డ క్షేమం.. పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలింపు
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన రేష్మా
-
Aug 27, 2025 09:39 IST
చెన్నై: తమిళ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్‌పై కేసునమోదు
శరత్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో విజయ్‌పై కేసునమోదు
మధురై TVK పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్ ఫిర్యాదు
నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు దాడిచేశారని ఆరోపణ
-
Aug 27, 2025 08:40 IST
జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు
వైష్ణోదేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు
30కి పెరిగిన మృతులు, పలువురికి గాయాలు
-
Aug 27, 2025 07:34 IST
ACAకు హనుమ విహారి గుడ్‌బై
త్రిపుర తరఫున ఆడనున్నట్లు విహారి ప్రకటన
-
Aug 27, 2025 06:47 IST
నేటి నుంచి భారత్‌పై అమెరికా సుంకాల భారం
గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25% సుంకాలు
భారత్ ఎగుమతులుపై అమెరికా 50 శాతం సుంకాలు
48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం
జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు..
పాదరక్షలు, విద్యుత్ యంత్రాల ఎగుమతులపై సుంకాల భారం
-
Aug 27, 2025 06:47 IST
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ చతుర్థి శోభ
వాడవాడలో వెలిసిన గణనాథుడి విగ్రహాలు
అధికంగా మట్టి గణేశుని విగ్రహాల వినియోగం
ABN ప్రేక్షకులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు
-
Aug 27, 2025 06:47 IST
తెలుగు ప్రజలకు వినాయచవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ప్రజల లక్ష్యాలకు విఘ్నాలు కలగకూడదని సీఎం చంద్రబాబు ఆకాంక్ష
ప్రజలకు శుభాలు కలగాలలి ప్రార్థిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్
-
Aug 27, 2025 06:45 IST
రేపు ఏపీ పెట్టుబడుల అభివృద్ధి మండలి భేటీ
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం