-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy trending Breaking news across globe 25th sept 2025 vreddy
-
BREAKING: బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్షన్
ABN , First Publish Date - Sep 25 , 2025 | 06:29 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 25, 2025 19:13 IST
బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్షన్
నాపై బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని టీవీలో చూశా: చిరంజీవి
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు..
అప్పటి వైఎస్ జగన్ సర్కార్‌తో సంప్రదింపులు జరపాలని కోరారు: చిరంజీవి
టికెట్ల ధరల గురించి మాట్లాడాలని కోరడంతో చొరవ తీసుకున్నా: చిరంజీవి
తొలుత అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడా: చిరంజీవి
మంత్రి ఆహ్వానంతో అప్పటి సీఎం జగన్‌ను కలిశా: చిరంజీవి
నన్ను సాదరంగా ఆహ్వానించారు: చిరంజీవి
లంచ్ చేస్తూ సినిమా పరిశ్రమ ఇబ్బందులను వివరించా: చిరంజీవి
సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య గ్యాప్ ఉందనే చర్చ జరుగుతోందని చెప్పా: చిరంజీవి
అందరం కలిసి వస్తామని చెప్పడంతో గత ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది: చిరంజీవి
డేట్స్ ఫిక్స్ అయ్యాక బాలకృష్ణతో ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేశా: చిరంజీవి
బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు: చిరంజీవి
బాలకృష్ణను కలవాలని జెమినీ కిరణ్‌కు చెప్పా: చిరంజీవి
మూడు సార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు: చిరంజీవి
ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి..
నారాయణమూర్తితో పాటు ముఖ్యులం వెళ్లాం: చిరంజీవి
గత సీఎం జగన్‌తో సినీ పరిశ్రమ ఇబ్బందులపై చర్చించాం: చిరంజీవి
అందుకు నాతోపాటు వచ్చినవారే సాక్ష్యం: చిరంజీవి
ఆ తర్వాతే టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది: చిరంజీవి
సినీ పరిశ్రమకు ఎంతోకొంత మేలు జరిగింది: చిరంజీవి
ఆ నిర్ణయం వల్లే మీ నరసింహారెడ్డి సినిమాకైనా..
నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ ధరలు పెరిగాయి: చిరంజీవి
దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది: చిరంజీవి
నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా..
నా సహజసిద్ధమైన ధోరణితో గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా మాట్లాడతా: చిరంజీవి
నేను ప్రస్తుతం భారత్‌లో లేనందునే ప్రకటన ద్వారా తెలియజేస్తున్నా: చిరంజీవి
-
Sep 25, 2025 17:45 IST
మెగా డీఎస్సీ మెగా హిట్‌గా నిలిచింది: మంత్రి లోకేష్
106 కేసులు వేసినా 150రోజుల్లో నియామక పత్రాలు అందచేసిన ఘనత ప్రభుత్వానిది: మంత్రి లోకేష్
ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహించి తీరుతాం: మంత్రి లోకేష్
నవంబర్‌లో టెట్ నిర్వహిస్తాం: మంత్రి లోకేష్
సీబీఎన్ అంటే డీఎస్సీ... డీఎస్సీ అంటే సీబీఎన్: మంత్రి లోకేష్
ఉత్తమ టీచర్లను విదేశాల్లో ఉత్తమ విద్యా విధానాల అధ్యయనం కోసం పంపాలని సీఎంను కోరిన లోకేష్
మా కుటుంబంలో 3తరాలకు డీఎస్సీ నిర్వహించే అవకాశం దక్కింది: లోకేష్
-
Sep 25, 2025 17:16 IST
భారీ వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశం
-
Sep 25, 2025 17:16 IST
కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. 42% రిజర్వేషన్లు అమలుచేయాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
జెన్‌జీ అంశంలో కేటీఆర్ వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు: కిషన్‌రెడ్డి
నేపాల్‌లో జరిగినట్లుగా.. పీఎం, మంత్రుల ఇంటిపైనా..
కోర్టులపైనా దాడులు జరిగినట్లుగా.. ఇక్కడ జరగాలని కేటీఆర్ భావిస్తున్నారా?: కిషన్‌రెడ్డి
బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలవుతోంది: కిషన్‌రెడ్డి
దేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది: కిషన్‌రెడ్డి
ప్రపంచ దేశాలతో పోలిస్తే.. మనం వేగంగా పురోగతి సాధిస్తున్నాం: కిషన్‌రెడ్డి
-
Sep 25, 2025 17:16 IST
తేజస్ ఫైటర్ జెట్ల కోసం HALతో రక్షణ శాఖ ఒప్పందం
రూ.62వేల కోట్లతో 97 తేజస్ ఫైటర్ జెట్లు
మిగ్-21 విమానాల స్థానంలో తేజస్ జెట్లు
-
Sep 25, 2025 15:41 IST
అసెంబ్లీలో MLA నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు
సినీ పరిశ్రమ అందరూ జగన్‌కు కలవడానికి వెళితే..
సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలని సైకో అన్నారు: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
అప్పుడు చిరంజీవి గట్టిగా అడిగారు... సీఎంను కలవడానికి వచ్చారనడం సరికాదు: బాలకృష్ణ
చిరంజీవిని అవమానించారనడం వరకూ వాస్తవమే: బాలకృష్ణ
నాకు కూడా అప్పడు ఆహ్వానం అందింది: బాలకృష్ణ
అప్పడు ఎవరు అడిగారు గట్టిగా..... అడిగితే పంపారా వాళ్లను లోపలికి అనేది సరి కాదు
దానిపై స్పష్టత ఇచ్చేందుకు ఇప్పుడు మాట్లాడుతున్నా: బాలకృష్ణ
ప్రతిపక్షం అయితే మానవత్వం ఉండాలిగా: బాలకృష్ణ
... తొమ్మిదో పేరు వేశారు... సారీ ఐ వాంట్ టూ క్లారిఫై దిస్
అంటూ సభలో నాటి భేటీ తీరుపై వివరణ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ
-
Sep 25, 2025 15:26 IST
గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులే: సీఎం చంద్రబాబు
గతంలో నాపై ఎప్పుడూ ఎవరూ కేసులు పెట్టలేదు: చంద్రబాబు
ఏ తప్పూ చేయను.. నాపై కేసులు పెట్టేందుకు భయపడతారు
నేను తప్పు చేయను.. న్యాయబద్ధంగా సరిగ్గా ఉంటా: సీఎం చంద్రబాబు
ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా
గత ప్రభుత్వ హయాంలో నాపై 17 కేసులు పెట్టారు: సీఎం చంద్రబాబు
నాపై ఎందుకు కేసులు పెట్టారని అడిగితే సమాధానం ఉండదు: చంద్రబాబు
కేసు వివరాలు వాట్సాప్‌లో పంపిస్తామనం అరాచకాలకు పరాకాష్ట
లోకేష్, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, ధూళిపాళ్లపై కేసులు పెట్టారు
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 66 కేసులు పెట్టారు: సీఎం చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలపై 2500 పైగా కేసులు పెట్టారు: సీఎం చంద్రబాబు
పులివర్తి నానిపై 31 కేసులు, చింతమనేని ప్రభాకర్‌పై 40కి పైగా కేసులు
ఎవరితో పరుషంగా మాట్లాడని నిమ్మల రామానాయుడిపై 20 కేసులు
రఘురామకృష్ణరాజును జైలులో చిత్రహింసలకు గురిచేశారు: చంద్రబాబు
-
Sep 25, 2025 13:45 IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు: వాతావరణ శాఖ
-
Sep 25, 2025 13:27 IST
అమరావతి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదన్న స్పీకర్ అయ్యన్న
దేవాలయంలో నేను పూజారిని మాత్రమే..
దేవుడే జగన్‌కు వరం ఇవ్వలేదు.. నేనేం చేయాలి?
నేను చట్ట ప్రకారమే నడుచుకుంటా: స్పీకర్ అయ్యన్న
నాపై ఏ కోర్టుకు వెళ్లినా అభ్యంతరం లేదు: స్పీకర్ అయ్యన్న
జగన్ సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్టాడాలి: స్పీకర్
-
Sep 25, 2025 13:05 IST
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
కెప్టెన్‌గా శుభ్‌మన్‌గిల్, వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా
భారత జట్టు: జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, పడిక్కల్
భారత జట్టు: ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్
భారత జట్టు: నితీష్, జగదీశన్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
ఆగస్టు 2 నుంచి 14 వరకు టెస్టు సిరీస్
-
Sep 25, 2025 12:38 IST
సోషల్ మీడియా పోస్ట్ లపై తెలంగాణ పోలీసులు ఆంక్షలు
సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై
రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని నిర్ణయం
అన్ని పోలీస్ స్టేషన్ లకు ఆదేశాలు జారీ చేసిన పోలీస్ శాఖ
సైబర్ నేరాలకు తరచుగా పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా ఉంచాలని ఆదేశం
సైబర్ క్రైమ్స్ , ఆర్థిక నేరాలు, సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశo
-
Sep 25, 2025 12:12 IST
IAS స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట
ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు
తదుపరి విచారణ వాయిదా
-
Sep 25, 2025 12:11 IST
మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
నాలా చట్టం ద్వారా భవన నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారు..
అందుకే నాలా చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయం: మంత్రి నారాయణ
-
Sep 25, 2025 12:10 IST
లద్దాఖ్‌లో కొనసాగుతోన్న సెక్షన్ 163 యాక్ట్
రాష్ట్ర హోదా కోరుతూ నిన్న లద్దాఖ్‌లో ఆందోళనలు
లేహ్ వ్యాప్తంగా పహారా కాస్తున్న పోలీస్ బలగాలు
-
Sep 25, 2025 11:43 IST
మేడ్చల్: అల్వాల్ పరిధిలో ముగ్గురిపై పొక్సో కేసు నమోదు,
ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారని కేసు,
ఈనెల 20న గుట్టలో దర్శనం తర్వాత బాలికలను లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం,
బాలికలను మరుసటిరోజు హైదరాబాద్‌లో వదిలి పరారైన యువకులు,
బాలికలు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో నిలదీసిన తల్లిదండ్రులు,
ముగ్గురు యువకులు, లాడ్జి నిర్వాహకులపై కేసు నమోదు
-
Sep 25, 2025 11:41 IST
అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు
వెంటనే అసెంబ్లీ లో విప్ లను అప్రమత్తం చేసిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
అప్పటికప్పుడు సుమారు 15 మంది MLA లను పిలిపించిన విప్ లు
ఆలస్యంగా వచ్చి, సమావేశాలు ప్రారంభం కాకముందే వెళ్ళిపోతున్న MLA లు పై సీఎం సీరియస్
సమావేశాలకు డుమ్మా కొట్టిన MLA లు కు ఫోన్లు చేస్తున్న విప్ లు
-
Sep 25, 2025 11:37 IST
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున
తన అనుమతి లేకుండా తన ఫొటో, పేరును వాడుకోకుండా..
నిషేధం ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్
నాగార్జున పిటిషన్‌ను విచారించిన జస్టిస్ తేజస్ కారియా
-
Sep 25, 2025 10:40 IST
కడప ఇన్‌ఛార్జ్ మేయర్‌గా ముంతాజ్ బేగంకు బాధ్యతలు
ముంతాజ్ బేగంకు బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు
అవినీతి ఆరోపణలతో మేయర్ సురేష్‌బాబును తొలగించిన ప్రభుత్వం
-
Sep 25, 2025 10:31 IST
ఏపీ అసెంబ్లీ సమీపంలో చీఫ్ విప్, విప్‌ల కోసం కార్యాలయాలు ఏర్పాటు
మీడియా పాయింట్ పైఅంతస్తులో అదనపు భవన సముదాయం ప్రారంభం
చీఫ్ విప్, విప్‌ల కోసం రూమ్స్ కేటాయించాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన భవనాలను అందుబాటులోకి తెచ్చాం: స్పీకర్
విప్‌లు, మీడియా కోసం అందుబాటులోకి 16 ఛాంబర్లు: మంత్రి నారాయణ
అనుకున్న ఖర్చు కంటే తక్కువలోనే పనులు పూర్తి చేశాం: పయ్యావు
-
Sep 25, 2025 10:30 IST
ఐరాసలో వరుస చేదు అనుభవాలపై స్పందించిన ట్రంప్
ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్, సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవడంపై ఆగ్రహం
మూడుసార్లు సాంకేతిక వైఫల్యాలు చోటుచేసుకున్నాయి: ట్రంప్
ఇవి యాదృచ్ఛికం కాదు.. నాపై కుట్రలే: డొనాల్డ్ ట్రంప్
-
Sep 25, 2025 10:29 IST
తిరుమలలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు పర్యటన
వేంకటాద్రి నిలయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం
రూ.102 కోట్లతో వేంకటాద్రి నిలయం నిర్మాణం, 4వేల మంది భక్తులకు వసతి
-
Sep 25, 2025 10:28 IST
హైదరాబాద్: సృష్టి ఆస్పత్రి వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ
త్వరలో డాక్టర్ నమ్రతను ప్రశ్నించనున్న ఈడీ
సరోగసి పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిన నమ్రత
-
Sep 25, 2025 09:16 IST
శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ల్యాండింగ్ సమయంలో విమానానికి తాకిన పక్షి
విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్
విమానంలోని 162 మంది ప్రయాణికులు సురక్షితం
-
Sep 25, 2025 08:52 IST
లద్దాఖ్ రాజధాని లేహ్‌లో అల్లర్లపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశాలు
ఇవాళ, రేపు, వచ్చేనెల 6న ఉన్నతస్థాయి కమిటీ సమావేశం
ఉన్నతస్థాయి కమిటీ భేటీలు జరగనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడి
లద్దాఖ్ అల్లర్లలో నలుగురు మృతి, 40 మంది పోలీసులు సహా 80 మందికి గాయాలు
నిన్న లేహ్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆందోళనలు
-
Sep 25, 2025 08:50 IST
రాజస్థాన్: నేడు బన్స్వారాలో ప్రధాని మోదీ పర్యటన
పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
-
Sep 25, 2025 08:48 IST
ఢిల్లీ: నేడు AICC పరిశీలకులతో ఖర్గే, రాహుల్ సమావేశం
డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం 22 మంది పరిశీలకులు
పాల్గొననున్న మీనాక్షి నటరాజన్, మహేష్‌కుమార్‌గౌడ్
-
Sep 25, 2025 08:46 IST
నేడు చెన్నైలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్
-
Sep 25, 2025 08:43 IST
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో విజిలెన్స్ విచారణకు గ్రీన్‌సిగ్నల్
అరవింద్‌కుమార్, BLN రెడ్డిని ప్రశ్నించేందుకు ఏసీబీ రంగం సిద్ధం
కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు లేఖ
న్యాయ సలహా కోరిన గవర్నర్
-
Sep 25, 2025 08:40 IST
శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు
-
Sep 25, 2025 08:39 IST
కన్నుల పండువగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
నేడు చిన్న శేషవాహనం, హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు
స్వామివారి వైభవాన్ని దర్శింకునేందుకు తరలిరానున్న భక్తకోటి జనం
ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
-
Sep 25, 2025 08:39 IST
మెగా డీఎస్సీ విజేతలకు నేడు నియామకపత్రాల అందజేత
నియామక పత్రాలు అందజేయనున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్
కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి లోకేష్, ప్రజాప్రతినిధులు
మొత్తం 15,941 డీఎస్సీ నియామకపత్రాలు అందజేత
-
Sep 25, 2025 06:42 IST
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
ఏపీపై వారం పాటు వాయుగుండం ఎఫెక్ట్
24, 25న కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు
26 నుంచి 29 వరకు పలుచోట్ల అతిభారీ వర్ష సూచన
27న ఉత్తరకోస్తా తీరాన్ని తాకనున్న వాయుగుండం
-
Sep 25, 2025 06:38 IST
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
ఏపీపై వారం పాటు వాయుగుండం ఎఫెక్ట్
24, 25న కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు
26 నుంచి 29 వరకు పలుచోట్ల అతిభారీ వర్ష సూచన
27న ఉత్తరకోస్తా తీరాన్ని తాకనున్న వాయుగుండం
-
Sep 25, 2025 06:37 IST
అల్పపీడనంతో తెలంగాణలో ఈ నెల 30వరకు భారీ వర్ష సూచన
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఈ నెల 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఈ నెల 27న వాయుగుండం తీరం దాటే అవకాశం
-
Sep 25, 2025 06:29 IST
నేడు ఢిల్లీలో డీసీసీ పరిశీలకుల నియామకంపై దిశానిర్దేశం
తెలంగాణ డీసీసీల నియామకానికి 22మంది పరిశీలకుల నియామకం
నేడు ఢిల్లీ AICC ఆఫీస్ ఇందిరాభవన్‌లో అవగాహన కార్యక్రమాలు
హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
అక్టోబరు 4 నుంచి తెలంగాణలో పర్యటించనున్న పరిశీలకులు