-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latestBreaking news across WOLRD 29th sept 2025 vreddy
-
BREAKING: ట్రంప్ మరో సంచలన నిర్ణయం
ABN , First Publish Date - Sep 29 , 2025 | 06:24 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 29, 2025 20:32 IST
తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని రేవంత్ ఆకాంక్ష
ప్రకృతి, పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ: సీఎం రేవంత్
ప్రజల ఐక్యతకు నిదర్శనం సద్దుల బతుకమ్మ పండుగ: సీఎం రేవంత్‌రెడ్డి
-
Sep 29, 2025 19:17 IST
హైదరాబాద్ కు క్రికెటర్ తిలక్ వర్మ..
రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు క్రికెటర్ తిలక్ వర్మ
దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోనున్న క్రికెటర్ తిలక్ వర్మ
ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌పై 69 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ
-
Sep 29, 2025 19:17 IST
హైదరాబాద్: ముగిసిన ఫిరాయింపు MLAల తొలిరోజు విచారణ
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్..
కాలె యాదయ్య, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి విచారణ
ఎల్లుండి విచారణకు హాజరుకానున్న మిగతా ఎమ్మెల్యేలు
-
Sep 29, 2025 19:17 IST
ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ గుడ్‌బై..
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ గుడ్‌బై
60 టెస్టుల్లో 192 వికెట్లు తీసిన క్రిస్ వోక్స్
122 వన్డేల్లో 173 వికెట్లు, 33 టీ20ల్లో 31 వికెట్లు సాధించిన క్రిస్ వోక్స్
-
Sep 29, 2025 19:17 IST
మహా బతుకమ్మ కార్యక్రమం..
హైదరాబాద్: సరూర్‌నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమం
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం 10 వేలమందితో బతుకమ్మ వేడుక
మహా బతుకమ్మ దగ్గర గిన్నిస్ బుక్ రికార్డు సభ్యుల పర్యవేక్షణ
-
Sep 29, 2025 18:59 IST
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100 శాతం సుంకం
అమెరికాలో నిర్మించిన చిత్రాలకు మినహాయింపు
భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
-
Sep 29, 2025 17:02 IST
ఘోర రోడ్డుప్రమాదం..
నల్గొండ: చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ దగ్గర రోడ్డుప్రమాదం
ఆటో-కారు ఢీకొని ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం
-
Sep 29, 2025 16:49 IST
విజయవాడ: దుర్గమ్మ సన్నిధిలో సీఎం చంద్రబాబు దంపతులు
ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
అమ్మవారి దర్శనానికి సాధారణ భక్తులకు ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
6 నెలల్లో అన్న ప్రసాద భవనం పూర్తి: సీఎం చంద్రబాబు
రూ.25 కోట్లతో 1500 మంది సామర్థ్యంతో అన్న ప్రసాద భవనం: చంద్రబాబు
రూ.27 కోట్లతో 3 నెలల్లో ప్రసాదం తయారీ వసతులు పూర్తి: సీఎం చంద్రబాబు
రూ.5.5 కోట్లతో ప్రధాన ఆలయం దగ్గర పూజా మండపం నిర్మాణం: చంద్రబాబు
-
Sep 29, 2025 16:49 IST
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
62 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
20 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Sep 29, 2025 16:47 IST
ప్రేమజంట ఆత్మహత్య..
పేరేచర్ల స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..
ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడుకి చెందిన గోపి..
తెనాలి మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రియాంక..
నరసరావుపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతు ప్రేమలో పడిన ఇద్దరు.
పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో రైలు కిందపడి ఆత్మహత్య..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మేడికొండూరు పోలీసులు..
-
Sep 29, 2025 15:07 IST
ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి ACB కోర్టు బెయిల్
ఎంపీ మిథున్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు
రూ.2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని కోర్టు ఆదేశం
ఏపీ లిక్కర్ కేసులో A-4గా ఎంపీ మిథున్‌రెడ్డి
వారంలో 2సార్లు మిథున్‌రెడ్డి సంతకాలు పెట్టాలని ఆదేశాలు
-
Sep 29, 2025 12:57 IST
తిరుపతి: నారాయణవనం సిద్ధార్థ కాలేజీలో దారుణం
జూనియర్ విద్యార్థిని చితకబాదిన సీనియర్ విద్యార్థులు
విషయం బయటికి చెబితే చంపేస్తామంటూ బెదిరింపులు
పోలీసులకు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు, కేసు నమోదు
ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమంటున్న పోలీసులు
ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన కాలేజీ యాజమాన్యం
-
Sep 29, 2025 12:16 IST
స్థానిక సంస్థల ఎన్నికలకు BRS సిద్ధం: కేటీఆర్
స్థానిక సమస్యలే ఎజెండాగా ప్రచారం చేస్తాం: కేటీఆర్
రైతుల సమస్యలను ప్రచారంలో హైలెట్ చేస్తాం: కేటీఆర్
ఇన్‌చార్జులే అభ్యర్థులను ఫైనల్ చేస్తారు: కేటీఆర్
-
Sep 29, 2025 11:19 IST
నేడు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు: వాతావరణ శాఖ
-
Sep 29, 2025 10:55 IST
అసెంబ్లీకి చేరుకుంటున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు
స్పీకర్ కార్యాలయానికి చేరుకున్న ప్రకాష్ గౌడ్
తన అడ్వకేట్లతో పాటు వచ్చిన ప్రకాష్ గౌడ్
ప్రకాష్ గౌడ్ పై పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్
సంజయ్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లు
స్పీకర్ కార్యాలయం ముందు తన ఫోన్, తన అడ్వకేట్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
-
Sep 29, 2025 10:11 IST
తెలంగాణ పంచాయతీ కార్యదర్శులకు నిధులు విడుదల
రూ.104కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
Sep 29, 2025 09:45 IST
జూబ్లీహిల్స్‌లో నటి సోహానీ కుమారి కాబోయే భర్త ఆత్మహత్య
ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సవాయ్‌సింగ్ బలవన్మరణం
తాను చేసిన తప్పులతో ఇబ్బందులు పడుతున్నానంటూ సెల్ఫీవీడియో
ఇటీవల రాజస్థాన్‌కు చెందిన సోహానీకి ఇన్‌స్టాలో పరిచయమైన సవాయ్‌సింగ్
పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న సోహానీకుమారి
-
Sep 29, 2025 09:42 IST
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
మధ్యాహ్నం 03.20 గంటలకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్తారు.
03.30 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు
సాయంత్రం 04.40 గంటలకు రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్తారు
05.20 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
06.00 గంటలకు పూర్వోదయం పథకంపై సమీక్ష నిర్వహిస్తారు
-
Sep 29, 2025 09:04 IST
సియోల్‌లో కొనసాగుతోన్న ఏపీ మంత్రుల బృందం పర్యటన
దక్షిణకొరియాలో అభివృద్ధి ప్రాజెక్ట్‌ల అధ్యయానికి వెళ్లిన..
మంత్రులు నారాయణ, జనార్దన్‌రెడ్డి, ఉన్నతాధికారులు
సియోల్‌లో భారత ఎంబసీ అధికారులతో మంత్రులు భేటీ
ఏపీ అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చ
-
Sep 29, 2025 09:01 IST
బీఆర్ఎస్ లో చేరికలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సీరియస్ ఫోకస్
జూబ్లీహిల్స్ లోని ఇతర పార్టీలకు చెందిన సెకండ్ గ్రేడ్ నాయకులకు బీఆర్ఎస్ గాలం
స్వయంగా నేతలతో మాట్లాడుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ భవన్ లో 11:30గంలకు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి పలువురు నాయకులు
-
Sep 29, 2025 08:59 IST
నేడు సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించే దిశగా 10వేల మందితో బతుకమ్మ వేడుక
సాయంత్రం 4గంటలకు బతుకమ్మ వేడుకలు ప్రారంభం
హాజరుకానున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క
-
Sep 29, 2025 08:38 IST
తిరుపతి జిల్లా: వరదయ్యపాలెంలో దారుణం..
పురిటిబిడ్డని ఇసుకలో పూడ్చి వెళ్ళిన కసాయి తల్లి
పారిశుధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం..
ఆసుపత్రికి తరలింపు
-
Sep 29, 2025 08:37 IST
చైనా మాజీ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు మరణశిక్ష
2007-24 మధ్యకాలంలో రూ.336 కోట్ల లంచాలు తీసుకున్నట్టు విచారణలో అంగీకరించిన టాంగ్
విచారణకు సహకరించినందుకు మరణశిక్ష అమలును రెండేళ్ల పాటు నిలిపివేసిన చైనా కోర్టు
-
Sep 29, 2025 08:14 IST
నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
ఉదయం 10:30గంటలకు SEC మీడియా సమావేశం
షెడ్యూల్ విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన SEC
-
Sep 29, 2025 06:28 IST
ఈరోజు నుండి తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు
నేటి నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు విదిస్తూ అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో ఆంక్షలు విధించిన స్పీకర్ కార్యాలయం
-
Sep 29, 2025 06:25 IST
ఆసియా కప్ సెరిమనీలో కీలక పరిణామం
ఆసియా కప్ తీసుకోని టీమిండియా
పాక్ మంత్రి, ACC చీఫ్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా..
ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరణ
టీమిండియా ట్రోఫీ తీసుకోకుండానే ముగిసిన ప్రెజెంటేషన్ సెరిమనీ
-
Sep 29, 2025 06:25 IST
హైదరాబాద్: నేటి నుంచి రూ.5 బ్రేక్‌ఫాస్ట్ పథకం
మోతీనగర్, మింట్ కాంపౌండ్ దగ్గర ఇందిరమ్మ క్యాంటీన్‌లో..
బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి పొన్నం
తొలిదశలో 60 ప్రాంతాల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం
-
Sep 29, 2025 06:24 IST
నేడు సరూర్‌నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం 10 వేల మందితో బతుకమ్మ వేడుక
-
Sep 29, 2025 06:24 IST
విజయవాడ: మ.3.30 గంటలకు ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు