-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking news across the globe 15th sept 2025 vreddy
-
BREAKING: బండి సంజయ్‌పై కేటీఆర్ పరువునష్టం దావా
ABN , First Publish Date - Sep 15 , 2025 | 06:33 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 15, 2025 21:38 IST
ప్రభుత్వంతో చర్చలు సఫలం..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం
బంద్ విరమించుకున్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు
ప్రస్తుతం రూ.600 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్న ప్రభుత్వం
దీపావళికి మరో రూ.600 కోట్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ
-
Sep 15, 2025 18:17 IST
పార్టీ మారిన 10 మంది MLAపై అనర్హత వేటు వేయాలి: జగదీశ్‌రెడ్డి
3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది
10 మంది MLAలు ఇప్పటికీ పార్టీ మారలేదని చెప్తున్నారు: జగదీశ్‌రెడ్డి
BRSపై మాకు విశ్వాసం ఉందని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు: జగదీశ్‌రెడ్డి
కాంగ్రెస్ సమావేశాలకు వెళ్తూ BRSలోనే ఉన్నామని అంటున్నారు: జగదీశ్‌రెడ్డి
10 స్థానాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయం: జగదీశ్‌రెడ్డి
-
Sep 15, 2025 18:17 IST
బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం
-
Sep 15, 2025 18:17 IST
ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ
రతన్ టాటా ఇన్నోవేషన్ సీఈవోగా ధాత్రిరెడ్డి
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ
మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా శౌర్యమాన్ పటేల్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ IPS రాహుల్‌దేవ్‌శర్మకు అదనపు బాధ్యతలు
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, APSBCL ఎండీగా అదనపు బాధ్యతలు
డిస్టలరీస్ అండ్ బ్రేవరీస్ కమిషనర్‌గా రాహుల్‌దేవ్‌కు అదనపు బాధ్యతలు
-
Sep 15, 2025 18:17 IST
హైదరాబాద్: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
పరారీలో డ్రగ్స్ ఫార్ములా విక్రయించిన గురువా రెడ్డి
పిల్లల స్కూల్ ఫీజ్ రూపంలో వచ్చిన డబ్బుతో..
గురువా రెడ్డి నుంచి ఫార్ములా కొనుగోలు చేసిన జయప్రకాష్
అల్ఫ్రాజోలం ఫార్ములాను రూ.2లక్షలకు అమ్మిన గురువారెడ్డి
-
Sep 15, 2025 18:17 IST
మహబూబాబాద్: గడ్డిగూడెంలో దారుణం
ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య రష్మిత యత్నం
భర్త ప్రసాద్‌పై కత్తితో దాడి, పరిస్థితి విషమం
ప్రియుడు అనిల్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదిన స్థానికులు
-
Sep 15, 2025 18:17 IST
బిహార్‌లోని పూర్ణియాలో ప్రధాని మోదీ పర్యటన
పలు అభవృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
4కోట్ల పక్కా ఇళ్లు పంపిణీ చేశాం: ప్రధాని మోదీ
-
Sep 15, 2025 18:17 IST
IPS సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
విజయవాడ ఏసీబీ కోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి
ఈనెల 18న ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని సంజయ్‌పై కేసు
విజయవాడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంజయ్
-
Sep 15, 2025 16:52 IST
పరువునష్టం దావా..
బండి సంజయ్‌పై కేటీఆర్ పరువునష్టం దావా
సిటీ సివిల్ కోర్టులో రూ.100కోట్ల దావా పిటిషన్ వేసిన కేటీఆర్
-
Sep 15, 2025 15:07 IST
అమరావతి: సంక్షేమం, P4, సూపర్ సిక్స్ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
సంపద సృష్టి, సంక్షేమంపై దృష్టి సారించాం: చంద్రబాబు
ప్రజల సాధికారిత కోసం 6 హామీలు ఇచ్చి సాకారం చేశాం: చంద్రబాబు
సూపర్ సిక్స్‌తో పాటు మేనిఫెస్టోలోనూ మరికొన్ని హామీలిచ్చాం
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ వారి చేతుల్లో భూములు లేవు: సీఎం చంద్రబాబు
కులవృత్తులు లేక బీసీలు ఆర్థికంగా వెనుకబడ్డారు: చంద్రబాబు
అసమానతలు అన్నీ తొలగించేలా ప్రణాళికలు చేశాం: చంద్రబాబు
అందుకే P4 వంటి కార్యక్రమాలను తీసుకొచ్చాం: చంద్రబాబు
-
Sep 15, 2025 15:07 IST
ఏపీ ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ కీలక ప్రకటన
ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం
రూ.2,500కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంపై అసంతృప్తి
-
Sep 15, 2025 15:07 IST
అమరావతి: GSDP పెంపు, పర్యాటక రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష
పోర్టులు, ఎయిర్‌పోర్టుల దగ్గర పర్యాటక ఎకోసిస్టం రూపొందించాలి
ఆర్థిక లావాదేవీల కేంద్రంగా టౌన్‌షిప్స్ అభివృద్ధి చేయాలి: సీఎం చంద్రబాబు
పర్యాటక ప్రాజెక్టులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: చంద్రబాబు
రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వ్యవసాయం, పరిశ్రమ రంగాలు కీలకం
భలబద్రాపురంలో తలెత్తిన ఆరోగ్యపరమైన అంశాలను అధ్యయనం చేయాలి: సీఎం
-
Sep 15, 2025 13:53 IST
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు భట్టి, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు
ఇంజినీరింగ్ వృత్తి విద్యా సంస్థల తీరుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సానుకూలంగా ఉన్నా బంద్ పాటింపుపై ఆగ్రహం
కాలేజీల విద్యా వ్యవస్థ నాణ్యత ప్రమాణాలపై గత ప్రభుత్వ హయాంలో...
విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును పరిశీలిస్తున్న ప్రభుత్వం
యాజమాన్యాలు సమ్మె విరమించి కాలేజీలు నడిపించాలని కోరిన ప్రభుత్వం
నేడు మరోమారు కొనసాగనున్న చర్చలు
-
Sep 15, 2025 13:49 IST
తెలంగాణలో మరోసారి నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు
ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం
మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన
రూ.1400 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియలో జాప్యంపై...
ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదని సమ్మె నిర్ణయం
హాస్పిటల్స్ నడిపించే పరిస్థితి లేదంటున్న ప్రవేట్ హాస్పిటల్స్
-
Sep 15, 2025 13:25 IST
అమరావతి: ఈ ఏడాది 17.11% వృద్ధి రేటు లక్ష్యం
2029కి 16.26 శాతం నమోదవుతుందని అంచనా
ఇబ్బందులున్నా ఆర్థికంగా పరుగులు తీస్తున్న ఏపీ
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్
-
Sep 15, 2025 13:05 IST
అమరావతి: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వ్యవసాయంపై చంద్రబాబు వ్యాఖ్యలు
యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందనడం కరెక్ట్ కాదు: చంద్రబాబు
దీనికి పంజాబ్‌ను కేసు స్టడీగా తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
ఏపీలో క్యాన్సర్ టాప్ 5 స్థానంలో ఉంది: సీఎం చంద్రబాబు
ఇలాగే కొనసాగితే క్యాన్సర్‌లో ప్రథమస్థానంలోకి వెళ్తాం: చంద్రబాబు
వచ్చే ఏడాది నుంచైనా యూరియాను బ్యాలెన్స్‌డ్‌గా వాడాలి: చంద్రబాబు
మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
-
Sep 15, 2025 12:58 IST
హైదరాబాద్: గొర్రెలు స్కామ్ కేసులో ఈడీ విచారణ
బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి వచ్చిన ఏపీ గొర్రెల రైతులు
గొర్రెల రైతులకు రూ.2 కోట్లు బ్రోకర్లు ఎగవేసినట్లు గుర్తింపు
పల్నాడు రైతుల స్టేట్‌మెంట్లు రికార్డు చేయనున్న ఈడీ
-
Sep 15, 2025 12:31 IST
హైదరాబాద్: ఇంజినీరింగ్ కాలేజీల బంద్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
విద్యాసంస్థల బంద్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం
సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ
నిన్న కాలేజీ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన భట్టి, శ్రీధర్ బాబు
చర్చల సారాంశం, యాజమాన్యాల డిమాండ్లు సీఎంకు వివరించిన మంత్రులు
నేడు ఉన్నత విద్యా సంస్థల బంద్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం
-
Sep 15, 2025 12:02 IST
తెలంగాణ ప్రభుత్వం దగ్గర సరియైన ప్రణాళిక లేదు: బండి సంజయ్
పక్కదారి పడుతోన్న యూరియాపై జవాబు చెప్పాలి: బండి సంజయ్
కేంద్రం కావలసినంత యూరియా ఇచ్చింది: కేంద్రమంత్రి బండి సంజయ్
ఇచ్చిన యూరియా పొలాల్లోకి కాక బ్లాక్ మార్కెట్‌కు వెళ్తోంది: బండి సంజయ్
పదేళ్లలో ఎప్పుడూ లేని యూరియా కొరత ఈ ఏడాదే ఎందుకు వచ్చింది?: బండి
-
Sep 15, 2025 11:59 IST
పంజాబ్: అమృత్‌సర్‌లో రాహుల్‌గాంధీ పర్యటన
అమృత్‌సర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలన
వరద బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శ
-
Sep 15, 2025 11:32 IST
ఆసియాకప్‌లో భారత్ విజయం ప్రశంసనీయం: షోయబ్ అక్తర్
టీమిండియాకు హ్యాట్సాఫ్... నాకైతే మాటలు రావడం లేదు: అక్తర్
రాజకీయాలతో క్రీడలను ముడిపెట్టొద్దు: షోయబ్ అక్తర్
మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చి ఉంటే బాగుండేది: షోయబ్ అక్తర్
-
Sep 15, 2025 11:13 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో కవిత పార్టీ అభ్యర్థి?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో...
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సమావేశం
అరగంటకుపైగా సాగిన మంతనాలు..
ఉపఎన్నికలో విష్ణును పోటీకి దించే యోచనలో కల్వకుంట్ల కవిత
-
Sep 15, 2025 10:47 IST
ఢిల్లీ: వక్ఫ్ బిల్లులో కొన్ని సెక్షన్లపై స్టే విధించిన సుప్రీంకోర్టు
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై మధ్యంతర తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
-
Sep 15, 2025 10:35 IST
తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చినా మార్లు రాలేదు: బండి సంజయ్
కాలేజీలకు టోకెన్లు ఇచ్చి టైంపాస్ చేస్తున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్
యాజమాన్యాలు చదువులు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: బండి సంజయ్
విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడటం తగదు: కేంద్రమంత్రి బండి సంజయ్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గం : కేంద్రమంత్రి బండి సంజయ్
కేసీఆర్ పదేళ్ల పాలనలో రూ.వేల కోట్ల బకాయిలు పెట్టారు : కేంద్రమంత్రి బండి సంజయ్
-
Sep 15, 2025 10:32 IST
ఏపీలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగోసారి కలెక్టర్ల సమావేశం
మొత్తం 8 అంశాల ప్రాతిపదికన కలెక్టర్ల సదస్సులో చర్చలు
కలెక్టర్ల సదస్సులో ఇవాళ నాలుగు అంశాలపై చర్చ
భవిష్యత్ దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
-
Sep 15, 2025 10:04 IST
జార్ఖండ్: హజారీబాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్
పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి
మావోయిస్టు అగ్రనాయకుడు సహదేవ్ సహా మరో ఇద్దరు మృతి
సహదేవ్ సోరెన్‌పై రూ.కోటి రివార్డ్
-
Sep 15, 2025 10:03 IST
పాకిస్థాన్‌కు సరిగ్గానే బదులిచ్చాం...
షేక్‌హ్యాండ్ నిరాకరణపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
ఆసియాకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్ జట్టు
మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో మాట్లాడకుండా...
షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన భారత ఆటగాళ్లు
-
Sep 15, 2025 09:55 IST
ఏపీ మెగా DSC-2025లో ఎంపికైన అభ్యర్ధులకు అభినందనలు: లోకేష్
apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో DSC ఎంపికల జాబితా లభ్యం: మంత్రి లోకేష్
-
Sep 15, 2025 09:50 IST
ఏపీ మెగా DSC-2025 ఫైనల్ లిస్ట్ విడుదల
మెగా DSC-2025 తుది ఎంపిక జాబితా విడుదల
16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి
జిల్లా విద్యాధికారి, కలెక్టరేట్లలో DSC తుదిజాబితా
మెగా DSC అధికారిక వెబ్‌సైట్‌లో DSC తుది ఎంపిక జాబితా
-
Sep 15, 2025 09:20 IST
వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన ఇద్దరు సీఐలపై వేటు,
టీడీపీ నేత జల్లయ్య హత్య కేసును తారుమారు చేసిన సీఐలు,
బాధిత కుటుంబ సభ్యులపైనే కేసు నమోదు చేసిన సీఐలు,
కూటమి ప్రభుత్వంలో విచారణ జరిపి మాచర్ల రూరల్ సీఐ షమీముల్లా, కారంపూడి సీఐ జయకుమార్‌పై సస్పెన్షన్ వేటు,
ఈ కేసులో అప్పటి గురజాల డీఎస్సీ జయరాం ప్రసాద్ ,
పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం
-
Sep 15, 2025 09:15 IST
రిటర్నుల గడువు పొడిగించడం లేదు: ఐటీ విభాగం
ఐటీ రిటర్నుల గడువు పొడిగించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం
-
Sep 15, 2025 09:14 IST
వాషింగ్టన్: భారతీయుడు నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్
నాగమల్లయ్యను చంపిన క్యూబా వలసదారుడిపై చర్యలకు ఆదేశం
అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే మా లక్ష్యం: డొనాల్డ్ ట్రంప్
అక్రమ వలసదారులను ఏ మాత్రం ఉపేక్షించం: డొనాల్డ్ ట్రంప్
-
Sep 15, 2025 08:23 IST
విజయవాడలో డయేరియా కేసులు
ఆందోళనలో న్యూరాజరాజేశ్వరిపేట వాసులు
ఇప్పటివరకు 350కిపైగా డయేరియా కేసులు నమోదు
-
Sep 15, 2025 08:20 IST
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ, రేపు కలెక్టర్ల సదస్సు
కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగోసారి కలెక్టర్ల సదస్సు
మొత్తం 8 అంశాల ప్రాతిపదికన కలెక్టర్ల సదస్సులో చర్చలు
కలెక్టర్ల సదస్సులో ఇవాళ నాలుగు అంశాలపై చర్చ
-
Sep 15, 2025 08:17 IST
నేడు బెంగాల్, బిహార్‌లో ప్రధాని మోదీ పర్యటన
కోల్‌కతాలో 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభించనున్న మోదీ
బిహార్‌లోని పూర్ణియా జిల్లాకు వెళ్లనున్న ప్రధాని మోదీ
రూ.36 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు
-
Sep 15, 2025 08:16 IST
నేటినుంచి TG ఐసెట్-2025 చివరి విడత కౌన్సెలింగ్
రేపు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఈ నెల 20న విద్యార్థులకు సీట్ల కేటాయింపు
-
Sep 15, 2025 08:16 IST
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దర్యాప్తు
నటి ఊర్వశి రౌతేలా, మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి నోటీసులు
నేడు విచారణకు హాజరుకానున్న మాజీ MP మిమి చక్రవర్తి
రేపు విచారణకు హాజరుకానున్న నటి ఊర్వశి రౌతేలా
-
Sep 15, 2025 08:03 IST
నేడు మరోసారి స్పీకర్‌ను కలవనున్న BRS నేతలు
పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరనున్న BRS నేతలు
-
Sep 15, 2025 07:27 IST
నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాతే..
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం
ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
-
Sep 15, 2025 07:26 IST
తెలంగాణపై అల్పపీడన ప్రభావం
నేడు ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్,..
సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట,..
సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం
-
Sep 15, 2025 07:00 IST
మొదలైన నైరుతి రుతుపవనాల నిష్క్రమణ
దేశంలో 7 శాతం అధికంగా వర్షాలు
ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం
-
Sep 15, 2025 06:35 IST
హైదరాబాద్‌లో కుండపోత
పలుచోట్ల నాలాలు పొంగి ముగ్గురు గల్లంతు
పలు ప్రాంతాలు అతలాకుతలం, కొట్టుకుపోయిన వాహనాలు
ముషీరాబాద్, బౌద్ధనగర్‌లో గంటన్నరలోనే 12 సెం.మీ. వర్షం
సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 24.3 సెం.మీ. వర్షపాతం
-
Sep 15, 2025 06:35 IST
తెలంగాణలో కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు
నేడు నిర్ణయం తీసుకుంటాం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నేటినుంచి తెలంగాణలో వెయ్యికి పైగా కాలేజీలు బంద్
తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థల నిరవధిక మూసివేత
ఫార్మసీ, బీఈడీ, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా
దసరాలోపు బకాయిలు రూ.1,200 కోట్లు చెల్లిస్తేనే విరమణ
ఈ నెల 21, 22న విద్యార్థులతో హైదరాబాద్‌లో భారీ ధర్నా
-
Sep 15, 2025 06:33 IST
నేడు ఏపీలో 2025 మెగా DSC ఫైనల్ లిస్ట్ విడుదల
16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి
-
Sep 15, 2025 06:33 IST
నేడు వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
3 కీలక అంశాలపై ఉత్తర్వులు ఇవ్వనున్న సుప్రీంకోర్టు