-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking news across GLOBE 1st oct 2025 vreddy
-
BREAKING: ఆల్మట్టి ఎత్తు పెంపుపై జగన్ ట్వీట్
ABN , First Publish Date - Oct 01 , 2025 | 06:27 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 01, 2025 21:42 IST
ఆల్మట్టి ఎత్తు పెంపుపై జగన్ ట్వీట్
రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు: జగన్
గతంలో కృష్ణా జలాల అంశంలో ఏపీకి అన్యాయం: జగన్
ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏపీ ఎడారిగా మారుతుంది: జగన్
చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తేవాలి: జగన్
-
Oct 01, 2025 21:42 IST
ఏపీలో సోషల్ మీడియా నియంత్రణకై లోకేష్ నేతృత్వంలో మంత్రుల కమిటీ
సభ్యులుగా అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారధి
సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై కమిటీ ఫోకస్
దుష్ప్రచారంపై నిఘా పెట్టనున్న ఐదుగురు సభ్యుల కమిటీ
అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసులపై అధ్యయనం చేయనున్న GoM
దుష్ప్రచారం, నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై చర్యలకు సిఫారసులు
పౌర హక్కుల పరిరక్షణకు సూచనలు ఇవ్వనున్న మంత్రుల కమిటీ
అవసరమైతే నోడల్ ఏజెన్సీ లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటుకు సిఫారసు
సిఫారసులను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న మంత్రుల కమిటీ
-
Oct 01, 2025 18:37 IST
తెప్పోత్సవం రద్దు..
విజయవాడ: దసరా రోజు కనకదుర్గమ్మ తెప్పోత్సవం రద్దు
అనుమతి ఇవ్వని జలవనరుల శాఖ అధికారులు
కృష్ణా నదికి వరద ప్రవాహం దృష్ట్యా అమ్మవారి నదీ విహారం రద్దు నిర్ణయం
హంస వాహనంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఉంచి పూజలు నిర్వహణ
-
Oct 01, 2025 18:37 IST
శ్రీమహిషాసురమర్థినిగా అమ్మవారి దర్శనం..
విజయవాడ: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా...
పదోరోజు శ్రీమహిషాసురమర్థినిగా అమ్మవారి దర్శనం
టీటీడీ తరఫున కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన...
టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, సుచిత్ర ఎల్లా
పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్
-
Oct 01, 2025 18:37 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రి ఆలయ అధికారుల నిర్లక్ష్యం
చినరాజగోపురం దగ్గర 4 రోజులుగా మార్చని పూల అలంకారం
నవరాత్రుల్లో మహర్నవమి రోజున కూడా గోపురానికి వాడిన పూలు
రూ.కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో ఇంద్రకీలాద్రి వెలవెల
VIP దర్శనాలకు ప్రాధాన్యత ఇచ్చే పనిలో బిజీగా ఆలయ అధికారులు
-
Oct 01, 2025 18:37 IST
తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల కీలక నిర్ణయం
బకాయిల కోసం సమ్మె బాట పట్టనున్న ప్రైవేట్ కాలేజీలు
ఈనెల 12లోగా బకాయిలు చెల్లించకపోతే 13 నుంచి సమ్మెకు నిర్ణయం
-
Oct 01, 2025 18:31 IST
సెప్టెంబర్‌లో పెరిగిన GST వసూళ్లు
సెప్టెంబర్‌లో రూ.1.89 లక్షల కోట్ల మేర GST వసూళ్లు
GST సంస్కరణలతో భారీగా పెరిగిన అమ్మకాలు
2024 సెప్టెంబర్‌లో రూ.1.73 లక్షల కోట్ల GST వసూల్లు
-
Oct 01, 2025 15:18 IST
కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు: పర్యటనలు వాయిదా వేసుకున్న టీవీకే అధ్యక్షుడు విజయ్
తమిళనాడు వ్యాప్త పర్యటనలను 2 వారాలపాటు వాయిదా వేసుకున్న విజయ్
విజయ్ పాల్గొన్న కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి
-
Oct 01, 2025 15:18 IST
పల్నాడు: నరసరావుపేటలో ఆటోడ్రైవర్‌గా ఎమ్మెల్యే చదలవాడ
ఆటోడ్రైవర్లతో కలిసి ఆటో నడిపిన చదలవాడ అరవిందబాబు
ఆటోడ్రైవర్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
ఆటోడ్రైవర్ల జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ
దసరా రోజు వాహనమిత్ర పథకం కింద ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం
వాహనమిత్ర పథకం కింద ఆటోడ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థికసాయం
-
Oct 01, 2025 12:27 IST
హైదరాబాద్: పోలీసులకు ఐబొమ్మ హెచ్చరిక
వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయటపెడతాం: ఐబొమ్మ
5కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మాదగ్గర ఉంది
మీడియా, OTT, హీరోలకు షాకింగ్ రివీల్ అవుతుంది: ఐబొమ్మ
-
Oct 01, 2025 11:09 IST
సినీ నటుడు నాగార్జున పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించిన హైకోర్టు
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
-
Oct 01, 2025 11:08 IST
కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది: మిథున్‌రెడ్డి
నన్ను అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందారు: మిథున్‌రెడ్డి
రాజమండ్రి జైలులో నన్ను ఒక తీవ్రవాదిలా చూశారు: మిథున్‌రెడ్డి
కోర్టు అనుమతించిన సదపాయాలను కూడా జైలులో నాకు కల్పించలేదు
అక్రమ కేసులు పెట్టి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు: మిథున్‌రెడ్డి
రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా: మిథున్‌రెడ్డి
-
Oct 01, 2025 11:08 IST
ఢిల్లీ: అంబేద్కర్ భవన్‌లో RSS శతాబ్ధి ఉత్సవాలు
పాల్గొన్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్, సీఎం రేఖ గుప్తా
ప్రత్యేక నాణెం, స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ
-
Oct 01, 2025 10:19 IST
వడ్డీ రేట్ల నిర్ణయాలు వెల్లడించిన ఆర్బీఐ
రెపో రేటు 5.5 శాతం యథాతథం: ఆర్బీఐ
-
Oct 01, 2025 09:39 IST
రేపు సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి
కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొననున్న సీఎం
రాత్రికి కొడంగల్ కు వెళ్లి అక్కడే బస..
-
Oct 01, 2025 09:34 IST
ఢిల్లీ: ఆస్పత్రిలో చేరిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే
జ్వరం, స్వల్ప శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఖర్గే
ప్రస్తుతం ఖర్గే ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
-
Oct 01, 2025 09:11 IST
ముగిసిన సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన
అమరావతి బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడు
-
Oct 01, 2025 08:37 IST
కడప: అనాధ పిల్లలకు మంత్రి నారా లోకేస్ చేయూత
దువ్వూరులో తల్లిదండ్రుల మృతితో అనాధలైన లక్ష్మి, యశ్వంత్
అనాధ పిల్లలను ఆదుకోవాలని కడప కలెక్టర్‌కు లోకేష్ ఆదేశం
ప్రధానమంత్రి మిషన్ వాత్సల్య పథకం కింద..
నెలకు చెరో రూ.4వేలు ఆర్థికసాయం ప్రకటించిన కలెక్టర్
-
Oct 01, 2025 08:12 IST
మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు.
అనుమతి లేకుండా మైలవరం CI కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం తో పోలీస్ ఉన్నతధికారుల చర్యలు.
జోగితో సహా మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన మరో ఏడుగురు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు మైలవరం ఎస్సై కె. సుధాకర్ వెల్లడి.
-
Oct 01, 2025 08:06 IST
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న పీసీసీ ఛీఫ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు
నిన్న రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో భేటీ అయిన బీసీ నేతలు
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు 8 తేదీన ఇవ్వనున్న తీర్పుపై చర్చించిన నేతలు
భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో చర్చించనున్న పీసీసీ ఛీఫ్, మంత్రులు,ఎమ్మెల్యేలు
దసరా తర్వాత బీసీ గర్జన కు ప్లాన్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్
-
Oct 01, 2025 07:47 IST
టార్గెట్ జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన
ఉదయం 10గంటలకు నియోజకవర్గంలోని బోరాబండకు కేటీఆర్
బోరబండ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ గార్డ్ వాటర్ ప్రూఫింగ్ కంపెనీని పరిశీలించనున్న కేటీఆర్
-
Oct 01, 2025 06:47 IST
శ్రీకాకుళం: నేడు అరసవల్లిలో అద్భుత దృశ్యం
మూలవిరాట్‌ను తాకనున్న సూర్యకిరణాలు
-
Oct 01, 2025 06:47 IST
తిరుమలలో 8వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఉదయం 8 గంటలకు స్వామివారి రథోత్సవం
రాత్రి అశ్వవాహనంపై మలయ్య స్వామి దర్శనం
-
Oct 01, 2025 06:46 IST
ఢిల్లీ: నేడు ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు
RSS శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
ప్రత్యేక స్టాంప్, నాణెం విడుదల చేయనున్న మోదీ
-
Oct 01, 2025 06:46 IST
అక్టోబర్ 3న మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
-
Oct 01, 2025 06:45 IST
ఢిల్లీ: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
Oct 01, 2025 06:45 IST
నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై విచారణ
స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్‌లో ఉ.11 గంటలకు విచారణ
MLAలు ప్రకాష్‌గౌడ్, గూడెం, యాదయ్య అడ్వొకేట్లను..
క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న BRS అడ్వొకేట్లు
-
Oct 01, 2025 06:44 IST
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సెబు ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం
-
Oct 01, 2025 06:27 IST
నేడు ఢిల్లీ నుంచి విజయనగరం జిల్లాకు ఏపీ సీఎం చంద్రబాబు
గజపతినగరం మండలం దత్తిలో పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు