Gold Jewellery Benefits: బంగారు చెవి కమ్మలు పెట్టుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?
ABN , Publish Date - Nov 23 , 2025 | 02:46 PM
బంగారు ఆభరణాలు అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని మీకు తెలుసా? బంగారు చెవి కమ్మలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఆడవాళ్లకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంగారు ఆభరణాలు మహిళల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే, ఇవి కేవలం అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయని మీకు తెలుసా? బంగారు చెవి కమ్మలు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగారు చెవిపోగుల ఆరోగ్య ప్రయోజనాలు
బంగారు చెవిపోగులు ధరించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడటం, చర్మ ఆరోగ్యం మెరుగుపడటం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బంగారు చెవికమ్మలు పెట్టుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని నమ్ముతారు.
బంగారు చెవిపోగులు ధరిస్తే మీ కంటి చూపు మెరుగుపడుతుంది. చెవిలోని నరాలు కళ్ళకు అనుసంధానించి ఉంటాయి. అందువల్ల దృష్టి మెరుగుపడుతుంది.
బంగారు చెవిపోగులు పెట్టుకోవడం వల్ల ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలుగుతుంది.
బంగారు చెవిపోగులు మీ మనస్సు నుండి ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తాయి. సానుకూల శక్తిని ఆకర్షించడంలో, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
బంగారు కమ్మలు పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని కొన్ని పురాతన సంప్రదాయాలు, నమ్మకాలు సూచిస్తున్నాయి. నాడీ వ్యవస్థ పనితీరును ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Also Read:
కాఫీ విషయంలో డాక్టర్ సూచన.. నెట్టింట రేగుతున్న కలకలం
లవ్లీ ‘లైన్ డ్యాన్స్’...ఆహ్లాదకరమైన వాతావరణంలో..
For More Latest News