Phycological Facts: నలుగురి దృష్టిలో పడాలంటే.. ఈ 4 టిప్స్ ఫాలో అవండి చాలు..
ABN , Publish Date - May 26 , 2025 | 12:45 PM
Personality Development: తెలివితేటలు, కష్టపడే తత్వం ఉన్నప్పటికీ చాలామంది గుర్తింపు తెచ్చుకోవడంలో వెనకబడే ఉంటారు. జీవితంలో నెగ్గుకురావాలన్నా, వందమందిలో ఉన్నప్పటికీ మీరే స్పెషల్ పర్సన్ అనిపించుకోవాలన్నా ఈ 4 లక్షణాలను అలవర్చుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులనే అందరూ ఇష్టపడతారని సర్వేలు చెబుతున్నాయి.
Science Of Likability: కొత్త, పాత అనే భేదం లేకుండా కొంతమంది ఇట్టే అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. చుట్టూ ఎంతమంది ఉన్నా అందరి చూపూ వీళ్ల పైనే ఉంటుంది. వీళ్ల మాటలు పదే పదే వినాలని ఆరాటపడతారు. నిజానికి, ఇదొక టెక్నిక్. కొందరికి పుట్టుకతోనే వస్తే.. మరికొందరు అదేపనిగా నేర్చుకుంటారు. దీని గురించి చాలామందికి తెలియదు. మీరు బాగా గమనిస్తే ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు అందరిలో ఈ లక్షణాలు కామన్‌గా కనిపిస్తాయి. అందుకే ప్రముఖుల మాటలు వినేందుకు ప్రజలు ఇష్టపడతారు. మరి, ఆ అలవాట్లు ఏవో మీరూ తెలుసుకోండి. అప్పుడు మిమ్మల్ని కూడా అందరూ ప్రత్యేకంగా గౌరవిస్తారు.
మాట్లాడేటప్పుడు పేర్లు గుర్తుంచుకోండి
ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాలని, మీ గురించి మరింత తెలుసుకోవాలని మీరు కోరుకుంటే.. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి పేరును గుర్తుంచుకోండి. పేరుతోనే సంబోధిస్తూ మాట్లాడండి. ఒక వ్యక్తిని పేరుతో పిలిచినప్పుడు వారి మనసుపై లోతైన ముద్ర పడుతుంది. మానసికంగా కనెక్ట్ అవుతారు. మీపై సానుకూల అభిప్రాయం కలుగుతుంది. ఆటోమేటిగ్గా ఆ వ్యక్తికి తెలియకుండానే మిమ్మల్ని ఇష్టపడటం, అభిమానించడం ప్రారంభిస్తారు.
వినడంపై దృష్టి పెట్టండి
అందరూ మిమ్మల్ని ఇష్టపడాలని కోరుకుంటే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాట్లాడటం కంటే వినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా అవతలి వ్యక్తికి సానుకూల అభిప్రాయం కలిగి మీ వైపు ఆకర్షితులవుతారు. మిమ్మల్ని ప్రత్యేకంగా చూడటం మొదలుపెడతారు.
బలాలు, తప్పులను అర్థం చేసుకోండి
వీలైనంత వరకూ తప్పు జరిగిన సందర్భాల్లో ముందుగా మీరే క్షమాపణ చెప్పేయండి. గొడవ పెరుగుతుందనే భయంతో దాచకుండా ఉన్నదున్నట్లుగా చెప్పే వైఖరి వల్ల అప్పటికి మీపై కోపం ప్రదర్శించినా మీపై సదభిప్రాయం కలుగుతుంది. ఇలా చొరవ చూపిన వ్యక్తులనే ఎవరైనా ఇష్టపడతారని సైకాలజిస్టులు కూడా చెబుతున్నారు.
హాస్య చతురత
మీరు గమనించే ఉంటారు. సరదాగా మాట్లాడే వ్యక్తులంటేనే చాలామందికి ఇష్టం. ఇలాంటివారిని ప్రతిఒక్కరూ ప్రత్యేకంగానే చూస్తారు. వారితో పరిచయం పెంచుకోవాలని, ఎక్కువసేపు మాట్లాడాలని కోరుకుంటారు. ఫన్నీగా ఉన్నవారితో మాట్లాడితే మానసిక ఒత్తిడి తగ్గి మనసు తేలికపడుతుంది. ఈ కారణంగానే ఎక్కువమంది హాస్య చతురత ప్రదర్శించే వారిని ఇష్టపడతారు.
Also Read:
అత్తమామలతో గొడవపడి పుట్టింట్లో ఉంటున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
ఈ కారణాల వల్లే భార్యలు భర్తలను మోసగిస్తారు..
For More Lifestyle And Telugu News