Share News

Power Of Silence: మౌనంగా ఉండటం నేర్చుకుంటే.. మీ లైఫ్‌లో సమూల మార్పులు

ABN , Publish Date - May 18 , 2025 | 10:00 PM

మౌనంగా ఉండటం నేర్చుకుంటే లైఫ్‌లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆత్మశక్తి, సంకల్పబలం పెరిగి జీవితం చెప్పుచేతల్లో ఉంటుందని అంటున్నారు.

Power Of Silence: మౌనంగా ఉండటం నేర్చుకుంటే.. మీ లైఫ్‌లో సమూల మార్పులు
power of silence

ఇంటర్నెట్ డెస్క్: మౌనానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. అనవసర మాటలకు దిగకుండా మౌనంగా అన్నీ గమనించేవారు జీవితంలో ఎంతో శక్తిమంతులవుతారని అనుభవజ్ఞులు చెబుతారు. ప్రపంచంలో రేగే అలజడుల నుంచి తమని తాము పూర్తి్స్థాయిలో రక్షించుకోగలుగుతారు. అసలు సిసలైన మానసిక ప్రశాంతతను సాధిస్తారు. మరి రోజూ ఎదురయ్యే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం ప్రాక్టీస్ చేస్తే ఆ తరువాత ఇదే అలవాటుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

విమర్శలు ఎదురైనప్పుడు తొందరపడి మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇలాంటప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తే విమర్శకులకు దీటుగా, కాన్ఫిడెంట్‌గా సమాధానం చెప్పినట్టు అవుతుంది. మిమ్మల్ని చిన్నబుచ్చాలనుకున్న వారి ప్రయత్నాలు విఫలమవుతాయి.

ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఎవరిమీదో నెపం పట్టాలని ప్రయత్నించొద్దు. ఏదో తక్కువైందని ఫిర్యాదులు చేయొద్దు. ఇలాంటి సమయాల్లో మౌనంగా ఉంటూనే సమస్యను భిన్న కోణాల్లో పరిశీలించి పరిష్కారం కోసం ప్రయత్నించాలి.


మాటల కంటే చేతలకు పదును ఎక్కువన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. మౌనంగా ఉంటూ మీ పని ద్వారానే సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి.

ఎవరైనా రెచ్చగొట్టేలా నోరు పారేసుకుంటే వెంటనే వాగ్యుద్ధానికి దిగొద్దు. ఇలాంటి సమయాల్లో క్షణ కాలం పాటు మౌనాన్ని ఆశ్రయించారు. అన్ని కోణాల్లో ఆలోచించేందుకు ప్రయత్నించి ఆ తరువాత బదులిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. క్షణికావేశాలకు లోనైతే పరిస్థితి వికటించే అవకాశం ఎక్కువ.


అవసరమైన సందర్భాల్లోనే మాట్లాడాలి. ముఖ్యంగా వదంతులు వ్యాపింపజేయడం, ఇతరుల గురించి అనవసర విషయాలు మాట్లాడకూడదు. లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో మౌనాన్ని ఆశ్రయిస్తే వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కునే సంకల్ప శక్తి ఒనగూడుతుంది.

Also Read:

Ban Turkey: పాకిస్తాన్‌కు సహాయం.. టర్కీకి వందల కోట్ల రూపాయల నష్టం

Kolkata Airport on High Alert: బాంబు బెదిరింపు కాల్.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్

S-400 Missile Defense System: మరిన్ని ఎస్-400లు కావాలి.. రష్యాకు భారత్ అధికారిక అభ్యర్థన

Updated Date - May 18 , 2025 | 10:09 PM