Share News

Favorite Color: కలర్ సైకాలజీ తెలుసా.. ఫేవరెట్ కలర్ బట్టి వ్యక్తిత్వం కనుక్కోవచ్చు..

ABN , Publish Date - Apr 22 , 2025 | 02:41 PM

Effect of Colours on Mood: ఒక్కో వ్యక్తికి ఒక్కో రంగు నచ్చుతుంది. ఎందుకు అని అడిగితే, చాలా మంది సమాధానం చెప్పలేరు. కానీ, కలర్ సైకాలజీ తెలిస్తే ఇష్టపడే కలర్స్ ను బట్టి మనస్తత్వాన్ని కనుక్కోవచ్చు. మరి,మీరెలాంటి వారో తెలుసుకోవాలనుందా..

Favorite Color: కలర్ సైకాలజీ తెలుసా.. ఫేవరెట్ కలర్ బట్టి వ్యక్తిత్వం కనుక్కోవచ్చు..
color psychology

Effect of Colours on Mood: కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే అకస్మాత్తుగా సంతోషంగా లేదా విచారంగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక క్షణంలో ఆకాశాన్ని తాకినంత సంతోషం కలిగితే.. మరుసటి క్షణంలోనే ఒంటరిగా చీకట్లో మగ్గిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న రంగుల వల్లే ఇలా జరుగుతుంది. అవును, కలర్ సైకాలజిస్టుల ప్రకారం ప్రతి రంగుకూ మనుషుల మూడ్, ప్రవర్తన మార్చగలిగే శక్తి ఉంది. ఏ రంగు వెనక ఏ అర్థముంది. ఇవి మన మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోండి.


ఎరుపు రంగు

ఎరుపు రంగును ఎక్కువగా వాడటం వల్ల జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. ఎరుపు రంగు ఉత్సాహాన్ని, తీవ్రత ఉద్రేకాన్ని రేకెత్తిస్తుంది. కొన్నిసార్లు అపరిమితమైన శక్తిని, ప్రేరణను అందిస్తుంది. సాహసానికి గుర్తు. కానీ, ఎక్కువగా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఆందోళన, భయము, కోపం వంటి ఒత్తిడి పెంచే భావోద్వేగాలకు దారితీస్తుంది.


నీలం

నీలం రంగు ప్రశాంతమైన రంగుగా పరిగణిస్తారు. ఈ రంగు బట్టలు వేసుకున్నా, చుట్టు పట్ల కనిపించినా ప్రశాంతంగా అనిపించి ఒత్తిడిని తగ్గుతుంది. ఎంత టెన్షన్ లో ఉన్న వ్యక్తి అయినా నీలం రంగు చూడగానే విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రంగు నిద్రలేమి సమస్యను కూడా తొలగిస్తుంది. బెడ్ రూమ్ లేదా ఆఫీసు కోసం ఈ రంగును ఉపయోగిస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. ఈ రంగు ఇష్టపడుతున్నారంటే.. జీవించు జీవించనివ్వు అనే సానుకూల భావంతో ఉంటారని అర్థం.


పసుపు

పసుపు రంగు ఆనందం, ఆశ, సృజనాత్మకతను పెంచుతుందని నమ్ముతారు. ఇది మెదడు సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరుస్తుంది. లోతైన ఆలోచనలు చేసేలా ప్రేరేపిస్తుంది. దీన్ని ఇష్టపడేవారు అత్యంత చురుకైనవారు. శుభకార్యాలకు దీన్నే వాడతారనే సంగతి తెలిసిందే. అయితే, ఎక్కువగా పసుపు రంగు కనిపిస్తే ఆందోళన, అశాంతి లాంటి భావోద్వోగాలు కలుగుతాయి.


ఆకుపచ్చ

ఆకుపచ్చ రంగుకు ప్రకృతికి విడదీయలేని అనుబంధం. పచ్చటి పైరు, చెట్లు చూడగానే ఎంత విచారంలో ఉన్నవారికైనా ప్రశాంతంగా అనిపించి రిఫ్రెష్ అవుతారు. ఇది కళ్ళపై పడ్డ ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. గ్రీన్ కలర్ మీ ఆలోచన, రిలేషన్స్, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపించి ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గ్రీన్ కలర్ ఇష్టపడేవారికి అంకిత భావం ఎక్కువ. అసూయ, దురాశకు కూడా ఈ రంగు చిహ్నం.


ఊదా

ఊదా లేదా పర్పుల్ రంగు ప్రజలను కళాత్మక వ్యక్తీకరణ, లోతైన ధ్యానం, ఆధ్యాత్మిక అవగాహనను పెంచుకునే దిశగా ప్రేరేపిస్తుంది. ఈ రంగు వల్ల మానసికంగా చెలరేగే ఆందోళనలు తగ్గిపోయి ప్రశాంతంగా మారిపోతారు. పర్పుల్ కలర్ నచ్చేవారు చాలా ప్రత్యేకమైన వ్యక్తులనే చెప్పాలి.


తెలుపు

తెలుపు రంగు స్వచ్ఛత, సరళత, అమాయకత్వం, శాంతికి సూచిక. ఈ కలర్ మన మానసిక స్థితిని తేలికపరుస్తుంది. ఈ రంగును ఇష్టపడేవారు చాలా తెలివైన వారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. కానీ ఎక్కువగా తెల్లటి బట్టలు ధరించినా, పరిసరాల్లో ఈ రంగు కనిపించినా జీవితం చప్పగా, నీరసంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.


నలుపు

నలుపు రంగు శక్తి, సీక్రెట్ కు చిహ్నం. ఈ రంగును ఇష్టపడే వారు ఎక్కువగా నిరాశ, విచారంతోనే గడుపుతుంటారు. మానసిక స్థితిని తీవ్రంగా మార్చగలదు, కానీ ఎక్కువగా నలుపు వాడటం విచారానికి దారితీస్తుంది.


నారింజ

నారింజ రంగు జీవితంలో ఉత్సాహం, సానుకూలతను పెంచుతుంది. ఎరుపు, పసుపు మిశ్రమమైన ఈ రంగు చాలా శక్తివంతమైనది. సంతోషానికి సూచిక. ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఇలాంటి రంగు మీ ఫేవరెట్ అయితే మీరు మంచి అభిరుచి, చైతన్యం, అత్యుత్సాహం కలిగిన వ్యక్తులు.


పింక్

పింక్ కలర్ అంటే చాలా మంది అమ్మాయిలకు ఇష్టం. ఈ రంగు ఇష్టపడేవాళ్లు చాలా రొమాంటిక్. చెప్పాలంటే దీని మరో పేరు లవ్ కలర్.


Read Also: Sleeping Tips: రాత్రి లైట్లు ఆఫ్ చేసి పడుకోవాలా.. చీకట్లో నిద్రపోతే మంచిదా..

Oxygen Plants: ఈ 6 మొక్కలు ఇంట్లో నాటితే ఆరోగ్యం, ఐశ్వర్యం..'

Chanakya Niti on Fools: ఇలాంటి వాళ్లు చదువుకున్న మూర్ఖులు..

Updated Date - Apr 22 , 2025 | 02:44 PM