Share News

Smart Projectors: స్మార్ట్ ప్రొజెక్టర్ల హవా.. ఇంట్లోనే సినిమాకు వెళ్లిన ఫీలింగ్

ABN , Publish Date - Dec 18 , 2025 | 08:15 PM

ఆధునియ యుగంలో వింతలు, విడ్డూరాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మానవ మేధస్సు ఏపాటిదో రుజువుచేస్తున్నాయి. ఔరా.. అనిపించే రేంజ్ లో నవకల్పనలు జీవనప్రమాణాల్ని ర్యాపిడ్ స్పీడుతో ముందుకు తీసుకెళ్తున్నాయి.

Smart Projectors: స్మార్ట్ ప్రొజెక్టర్ల హవా.. ఇంట్లోనే సినిమాకు వెళ్లిన ఫీలింగ్
Home Theatre Projectors

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 18: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కొత్త ట్రెండ్ స్మార్ట్ ప్రొజెక్టర్లు. ఇప్పుడు హోమ్ థియేటర్ ప్రపంచాన్ని మార్చేస్తున్నాయి. సాంప్రదాయ టీవీలకు బదులుగా, ఈ పరికరాలు పెద్ద స్క్రీన్ (100-300 అంగుళాలు) అనుభవాన్ని ఇస్తున్నాయి.

బిల్ట్-ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ (Android TV లేదా Google TV)తో వచ్చే ఈ ప్రొజెక్టర్లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్‌ను డైరెక్ట్‌గా రన్ చేస్తాయి. ఎక్స్‌టర్నల్ స్ట్రీమింగ్ డివైస్ అవసరం లేదు.


ముఖ్య ఫీచర్లు:

ఆటో ఫోకస్ అండ్ కీస్టోన్ కరెక్షన్: సెటప్ సులభం, ఆటోమాటిక్‌గా ఇమేజ్ అడ్జస్ట్ అవుతుంది

వై-ఫై అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ: వైర్‌లెస్ స్ట్రీమింగ్, స్మార్ట్‌ఫోన్ నుంచి మిర్రరింగ్

హై రిజల్యూషన్: చాలా మోడల్స్ 4K సపోర్ట్, HDRతో షార్ప్ కలర్స్ తో మంచి అనుభూతిని ఇస్తున్నాయి

పోర్టబుల్ డిజైన్: బ్యాటరీతో వచ్చే మోడల్స్ బయటికి తీసుకెళ్లడానికి అనువుగా ఉంటాయి

బిల్ట్-ఇన్ స్పీకర్స్: మంచి సౌండ్ క్వాలిటీ (కొన్ని Harman Kardonతో)వస్తున్నాయి


2025లో పాపులర్ మోడల్స్:

XGIMI Horizon Ultra, Hisense PX3-PRO, Aurzen EAZZE D1, Samsung Freestyle 2nd Gen వంటివి టాప్ రేటింగ్స్ పొందాయి

అడ్వాంటేజెస్:

టీవీలతో పోలిస్తే స్మార్ట్ ప్రొజెక్టర్లు చవకగా, పోర్టబుల్‌గా ఉంటాయి. గోడపై పెద్ద సినిమా థియేటర్ అనుభూతినిస్తాయి. లేజర్ లైట్ సోర్స్ మోడల్స్ 20,000 గంటల వరకు లాంగ్ లైఫ్ ఇస్తాయి. ఇంట్లో మూవీ నైట్స్, గేమింగ్ లేదా ప్రెజెంటేషన్స్‌కు ఐడియల్.

పోర్టబుల్ మోడల్స్‌తో బయట క్యాంపింగ్‌లో కూడా ఎంజాయ్ చేయవచ్చు. రూ. ఐదు వేల నుంచి వివిధ కంపెనీ ప్రొజెక్టర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.


Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 18 , 2025 | 08:29 PM