Shopping Tips: షాపింగ్‌లో వృథా ఖర్చు అరికట్టేందుకు సింపుల్ టిప్స్..
ABN , Publish Date - Jul 04 , 2025 | 08:19 PM
Budget Shopping Advice: షాపింగ్‌కు వెళ్లిన ప్రతిసారీ తెలియకుండానే విపరీతంగా ఖర్చు చేసేస్తున్నారా? బడ్జెట్లోనే షాపింగ్ చేయాలని ప్రయత్నించినప్పటికీ మీ వల్ల కావడం లేదా? ఈ వృథా ఖర్చు అరికట్టి మీ డబ్బు ఆదా చేసేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు ఇక్కడున్నాయి.
షాపింగ్ చేయడం కొంతమందికి సరదా అయితే.. మరికొందరికి వ్యసనం. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. బయటకు వెళ్లిన ప్రతిసారీ తరచుగా చీరలు, బట్టలు, నగలు, గృహోపకరణాలు లాంటివి అవసరమైన వస్తువులు తప్పక కొనుగోలు చేస్తుంటారు. చాలాసార్లు తమకు తెలియకుండానే అనవసర వస్తువులూ కొనేస్తుంటారు. కొందరు మాత్రం అవీ ఇవీ అని తేడా లేకుండా కంటికి ఇంపుగా అనిపించినవన్నీ కొనేస్తుంటారు. దీంతో చివరికి బిల్లు తడిసిమోపెడవుతుంది. ఇలా షాపింగ్ పేరుతో మీ జేబుకు చెల్లు పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలను అనుసరిస్తే చాలు.
ఈ చిట్కాలతో డబ్బు ఆదా
జాబితా తయారు చేసుకోండి: మీరు షాపింగ్ చేయడానికి వెళ్ళే ముందు కొనవలసిన వస్తువులకు సంబంధించిన లిస్ట్ రాసుకోండి. ఈ పద్ధతిని కిరాణా షాపింగ్ కోసం మాత్రమే కాకుండా బట్టలు మొదలైన వాటికి కూడా ఉపయోగించండి. ఇలా చేస్తే అనుకున్న వాటిని మాత్రమే కొనుగోలు చేస్తారు. షాపింగ్ చేసేటప్పుడు అనవసరమైన వస్తువులను కొనకుండా ఉండటానికి ఈ చిట్కా మీకు సహాయం చేస్తుంది.
నగదు: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు లేదా డిజిటల్ పేమెంట్ల అన్ని లావాదేవీలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంది. ఎందుకంటే, చేత్తో లెక్కపెట్టుకుని ఇవ్వకపోవడం వల్ల ఎంత డబ్బు ఖర్చవుతున్నదీ చాలామందికి వెంటనే అర్థం కావడం లేదు. కాబట్టి, అనుకున్న బడ్జెట్ ప్రకారం అవసరమైన నగదు మాత్రమే తీసుకెళ్లండి. ఆ మొత్తంతో మాత్రమే షాపింగ్ చేసేందుకు ప్రయత్నించండి.
కొనే ముందు ఆలోచించండి: కొంతమంది షాపింగ్ కి వెళ్ళినప్పుడు వారికి అవసరమైన వస్తువులను మాత్రమే కాకుండా నచ్చాయని అనవసరమైన వస్తువులనూ కొంటారు. ఇలా చేయడం వల్ల డబ్బు వృథా అవుతుంది. కాబట్టి, ఒకటికి పదిసార్లు ఆలోచించి అవసరమైన వస్తువులను మాత్రమే కొనండి.
ఆఫర్లకు ఆకర్షితులవ్వకండి: చాలా మంది ఆఫర్లకు ఆకర్షితులవుతారు. తక్కువ ధరకు వస్తువులు లభిస్తున్నాయని అవసరం లేకపోయినా ఆఫర్లలో లభించే వస్తువులను కొనుగోలు చేస్తారు. అలా చేయడం వల్ల డబ్బు వేస్ట్ అవుతుంది.
బడ్జెట్ సెట్ చేసుకోండి: కొంతమంది దగ్గర డబ్బు చేతిలో రాగానే తొందరపడి షాపింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల డబ్బు వృథా అవుతుంది. కాబట్టి ప్రతి కొనుగోలుకు ఒక నిర్దిష్ట బడ్జెట్ సెట్ చేసుకోండి. ఆ బడ్జెట్ ప్రకారమే షాపింగ్ చేస్తే డబ్బు ఆదా అవుతుంది.
ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ ధరల పోలిక: మీరు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు దాని ధరను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ తనిఖీ చేయండి. కొన్నిసార్లు ధరలలో భారీ వ్యత్యాసం ఉంటుంది. వస్తువు ధర ఆన్‌లైన్‌లో తక్కువగా ఉంటే దానిని అక్కడే కొనండి. ఆఫ్‌లైన్‌లో తక్కువగా ఉంటే అలాగే కొనండి.
తెలివిగా షాపింగ్ చేయండి: మీరు ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడల్లా తెలివిగా షాపింగ్ చేయండి. తొందరపడి ఏమీ కొనకూడదు. వస్తువులను కొనేటప్పుడు జాగ్రత్తగా ఉంటే తేలికగా డబ్బు ఆదా చేయవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
టెలిగ్రామ్ ద్వారా లక్షల ఆదాయం.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే.!
వాట్సాప్ ద్వారా వేల ఆదాయం.. ఎలానో తెలుసా?
For More Lifestyle News