Share News

Relationship Tips: అబ్బాయిల్లో ఈ లక్షణాలు అమ్మాయిలకు నచ్చవట

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:04 PM

చాలా మంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయితో ఎక్కువగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాంటి సందర్భాల్లో వారు ప్రదర్శించే కొన్ని లక్షణాలు అమ్మాయిలకు నచ్చవట..

Relationship Tips: అబ్బాయిల్లో ఈ లక్షణాలు అమ్మాయిలకు నచ్చవట
Relationship Tips

ఇంటర్నెట్ డెస్క్: అబ్బాయిలు ఎక్కువగా తమకు నచ్చిన అమ్మాయితో ఉండటానికి ఇష్టపడతారు. అవకాశం దొరికినప్పుడల్లా, తమకు ఇష్టమైన వారితో మాట్లాడటానికి, టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పరిస్థితిలో, ఈ అబ్బాయిలు ప్రదర్శించే కొన్ని లక్షణాలు అమ్మాయిలకు చాలా చిరాకు తెప్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, అబ్బాయిలలో అమ్మాయిలు ఏ లక్షణాలను ఇష్టపడరో ఇప్పుడు తెలుసుకుందాం..


అమ్మాయి ఫోన్ నంబర్ అడగడం:

కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని తెలిసిన వెంటనే ఆమె ఫోన్ నంబర్ అడుగుతారు. అయితే, ఏ అమ్మాయి కూడా తన ఫోన్ నంబర్ అడగడాన్ని ఇష్టపడదట. ఇది వారికి చిరాకు తెప్పిస్తుందట.

గత ప్రేమకథలు అడగడం:

ఎవరూ తమ గత ప్రేమకథలను, బ్రేకప్‌లను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఆమె గత జీవిత కథ గురించి అడిగితే, ఆమెకు అది అస్సలు నచ్చదట.


ఫొటోలు అడగడం:

కొంతమంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిని ఆమె ఫొటోలు కోసం పదే పదే అడుగుతారు. ఫొటోలు పంపమని చెప్పి ఆమెను వేధిస్తారు. అయితే, ఏ అమ్మాయి కూడా అబ్బాయిల్లో ఈ లక్షణాన్ని ఇష్టపడదు.

అతిగా పొగడటం:

కొంతమంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయి అందాన్ని పదే పదే పొగుడుతూ ఉంటారు. అయితే, అమ్మాయిలు ఈ గుణాన్ని ఇష్టపడరు, అలాంటి పొగడ్తలు వారిని అసౌకర్యానికి గురి చేస్తాయని నిపుణులు అంటున్నారు.


Also Read:

జీవితంలో ఈ ఐదుగురిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి.!

వర్షాకాలంలో జాగ్రత్త.. పిల్లలు ఈ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.!

For More Latest News

Updated Date - Sep 14 , 2025 | 12:09 PM