Cat Care Tips: పిల్లిని పెంచుకుంటున్నారా? జాగ్రత్త
ABN , Publish Date - Nov 22 , 2025 | 02:57 PM
చాలా మందికి కుక్కలు, పిల్లులను పెంచుకునే అలవాటు ఉంటుంది. అయితే, పిల్లులను పెంచుకునే వారు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మందికి కుక్కలు, పిల్లులను పెంచుకునే అలవాటు ఉంటుంది. అయితే, ఈ పెంపుడు జంతువుల వల్ల మనుషులకు చాలా ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువులతో దగ్గరగా ఉన్నప్పుడు అవి కరచినా, తుమ్మినా రేబిస్ అనే ప్రాణాంతక వ్యాధి వస్తుందని చెబుతున్నారు.
ఇటీవల ఒక పరిశోధనలో పిల్లులతో ఎక్కువగా సంబంధం ఉండే వ్యక్తులకు స్కిజోఫ్రెనియా అనే తీవ్రమైన మానసిక రుగ్మత వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. స్కిజోఫ్రెనియా వ్యాధి ఉన్న వ్యక్తికి వాస్తవాన్ని గుర్తించే, ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. భ్రమలు, అపోహలు, లేని స్వరాలు వినిపించడం, అసాధారణ ప్రవర్తన వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. పిల్లిని పెంచుకోవడం చాలా మందికి ఆనందంగా ఉంటుంది. కానీ, పిల్లిని పెంచుకునేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
జాగ్రత్తలు
పిల్లి ఉండే ప్లేస్‌ను రోజూ శుభ్రం చేయాలి. పిల్లి ఉపయోగించే ప్లేట్లు, బౌల్స్ శుభ్రంగా ఉంచాలి.
రెగ్యులర్‌గా వెటర్నరీ చెకప్ చేయించాలి. వ్యాక్సినేషన్ అస్సలు మిస్ కాకూడదు. పిల్లికి ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
పిల్లిని బయటకు ఎక్కువగా తిరగనివ్వకండి. బయట తిరిగితే ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అలాగే, పిల్లి ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లికి మిగిలిన ఇంటి భోజనం ఇవ్వడం మంచిది కాదు. పిల్లుల కోసం ప్రత్యేకంగా క్యాట్ ఫుడ్ ఇవ్వడం మంచిది. చాక్లెట్, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎముకలు వంటి వాటిని ఎప్పుడూ ఇవ్వకూడదు.
ముఖ్యంగా, పిల్లిపై నేరుగా ముద్దులు పెట్టడం, దగ్గరగా ముఖానికి తగలడం మంచిది కాదు. ఎందుకంటే, పిల్లుల నుంచి కొన్ని పరాన్నజీవులు మనుషులకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి.
Also Read:
జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?
డ్రాగన్ ఫ్రూట్.. ఈ సమస్యలు ఉన్నవారికి మంచిది.!
For More Latest News