PPF Investment Benefits: పోస్టాఫీసు PPF పథకం.. నెలకు రూ.61,000 రాబడి
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:59 PM
మీరు భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం మీకు ఎంతగానో సహాయపడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: మీరు భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే, పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం మీకు ఎంతగానో సహాయపడుతుంది. దీని ద్వారా మీరు నెలకు రూ. 61,000 వరకూ వడ్డీ ఆదాయం పొందే అవకాశం ఉంది.
PPF పథకం అంటే ఏమిటి?
PPF పథకం (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) అనేది భారత ప్రభుత్వం అందించే సురక్షితమైన, దీర్ఘకాలిక పొదుపు పథకం. ఇది స్థిరమైన రాబడితో పాటు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం, ముఖ్యంగా పదవీ విరమణ కోసం పొదుపు చేయాలనుకునే వారికి అనువైనది. ఈ పథకంలో డిపాజిట్లపై పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీ ఆదాయం కూడా పన్ను మినహాయింపు ఉంటుంది.
PPF పథకం ముఖ్య లక్షణాలు:
PPF డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులకు అర్హత పొందుతాయి. అంతేకాకుండా, PPF నుండి వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటాయి.
ఇది ప్రభుత్వ-మద్దతుగల పథకం కాబట్టి, పెట్టుబడి చాలా సురక్షితంగా ఉంటుంది.
PPF పథకం స్థిరమైన, హామీతో కూడిన రాబడిని అందిస్తుంది, ఇది ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.
PPF పథకం 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలాన్ని కలిగి ఉంటుంది, ఇది దీర్ఘకాలిక పొదుపుకు అనుకూలంగా ఉంటుంది.
ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
ఏ వయసు వారైనా, బ్యాంకు లేదా పోస్టాఫీసులో PPF ఖాతాను తెరవవచ్చు.
తక్కువ రిస్క్ తీసుకొని, దీర్ఘకాలంలో మంచి రాబడిని కోరుకునే వ్యక్తులకు ఇది ఉత్తమమైన ఎంపిక.
PPF పథకంతో నెలకు రూ. 61,000
ఈ పథకం కనీసం 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. మీరు PPFలో వరుసగా 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టి, ఆపై రెండు ఐదు సంవత్సరాల పొడిగింపులను తీసుకుంటే, 25 సంవత్సరాలలో వడ్డీతో కలిపి అది రూ. 1.03 కోట్లుగా మారుతుంది. అంటే మీరు నెలకు సుమారు రూ. 61,000 సంపాదించవచ్చు.
మీరు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ. 22.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఈ మొత్తానికి 7.1% వడ్డీ వస్తుంది కాబట్టి 15 సంవత్సరాల తర్వాత మీ మొత్తం రూ. 40.68 లక్షలు అవుతుంది. అంటే, రూ. 18.18 లక్షలు వడ్డీ వస్తుంది. మీరు ఈ మొత్తాన్ని మరో 5 సంవత్సరాలపాటు పొడగిస్తే ఎలాంటి పెట్టుబడులు పెట్టకున్నా ముందున్న రూ. 40.68 లక్షలపై వడ్డీ వస్తుంది. 5 ఏళ్లలో ఇది రూ. 57.32 లక్షలు అవుతుంది. అంటే, ఈ 5 ఏళ్లలో మీరు రూ. 16.64 లక్షలు వడ్డీగా సంపాదిస్తారు. అలాగే, ఇంకో 5 సంవత్సరాలు మీరు మళ్లీ ఏమీ డిపాజిట్ చేయకుండానే ఆ మొత్తమే వడ్డీతో రూ. 80.77 లక్షలు అవుతుంది. ఈ దశలో రూ. 23.45 లక్షలు వడ్డీ వస్తుంది. అయితే, మీరు మరో 10 సంవత్సరాల పాటు ఏటా రూ. 1.5 లక్షలు పెడితే మొత్తం రూ. 1.03 కోట్లు అవుతుంది! ఇలా మీరు నెలకు సుమారు రూ. 61,000 సంపాదించవచ్చు.
Also Read:
సూపర్ టేస్టీ తోటకూర లివర్ ఫ్రై .. ఒక్కసారి ట్రై చేయండి!
దసరాకు 101 వంటకాలతో భోజనం.. చిన్న పొరపాటు జరగడంతో కొత్త అల్లుడికి తులం బంగారం
For More Latest News