Share News

Oil Stains on Clothes: బట్టలపై నూనె మరకలు పోవట్లేదా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం..!

ABN , Publish Date - Jul 15 , 2025 | 08:57 PM

వంటగదిలో పనిచేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు లేదా అనుకోని విధంగా కొన్నిసార్లు దుస్తులపై అనుకోకుండా వివిధ రకాల మరకలు ఏర్పడతాయి. అంతేగాక, కారు లేదా బైక్‌పై గ్రీజు వేసేటప్పుడు బట్టలకు అంటుకోవచ్చు. వీటిని ఎంత వాష్ చేసినా సులభంగా పోవు. అలాంటప్పుడు ఈ టిప్స్ ట్రై చేయండి. మరకలు క్షణాల్లో మాయమవుతాయి.

Oil Stains on Clothes: బట్టలపై నూనె మరకలు పోవట్లేదా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం..!
How to Remove Oil Stains on Clothes

How to Remove Oil Stains on Clothes: భోజనం చేసేటప్పుడు లేదా వంటగదిలో ఉన్నప్పుడు నూనె లేదా నెయ్యి బట్టలకు అనుకోకుండా అంటుకుంటాయి. ఇక చాలాసార్లు బైక్ లేదా కార్లకు గ్రీజు వేసుకునేటప్పుడు చొక్కాలు, ప్యాంట్లపై పడతాయి. పిల్లలయితే ఇల్లంతా కలయతిరుగుతూ ఉంటారు కాబట్టి తరచూ ఇలాంటి మరకలు వారి దుస్తులే ఎక్కువగా పాడవుతుంటాయి. బట్టలపై ఏ మరకలు అంటినా ఈజీగానే తొలగిపోతాయి కానీ నూనె లేదా గ్రీజు మరకలు మాత్రం అంత త్వరగా వదలవు. ఇలాంటి మొండి మరకలు అందమైన దుస్తులను పాడు చేయకూడదంటే ఈ హోం టిప్స్ ప్రయత్నించండి.


బట్టలపై నూనె, నెయ్యి, గ్రీజు మరకలను తొలగించే టిప్స్

  • వంట చేసేటప్పుడు పొరపాటున దుస్తులపైన నూనె లేదా నెయ్యి పడితే వెంటనే వాటిని శుభ్రం చేయండి. త్వరగా శుభ్రపరచడం వల్ల మరకలు బట్టలలో లోతుగా ఇంకిపోకుండా ఉంటాయి. నూనె, నెయ్యి మరకలను తొలగించడానికి బేకింగ్ సోడాను ఉపయోగించండి. ఇది గ్రీజు మరకలను పోగొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరకలు అంటిన ప్రదేశంలో బేకింగ్ సోడాను చల్లి 20 నిమిషాలు అలాగే ఉంచండి. మృదువైన బ్రష్‌తో సున్నితంగా రుద్ది బ్రష్ చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేయండి.

  • నూనె, నెయ్యి లేదా గ్రీజు మరకలు ఉన్న చోట డిష్ వాషర్ సోప్ ఉంటే పూసి కొంత సమయం అలాగే ఉంచండి. తర్వాత సున్నితంగా రుద్ది నీటితో శుభ్రం చేయండి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే మరకలు సులువుగా వదులుతాయి.


  • నూనె, నెయ్యి, గ్రీజు మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా, సుద్దను కూడా ఉపయోగించవచ్చు. మరకపై సుద్దను చల్లి ఆపై రుద్దండి. ఇప్పుడు దుస్తులను సాధారణ పద్ధతిలో నీటిలో శుభ్రం చేయండి.

  • నిమ్మకాయ ఒక సహజ బ్లీచ్. ఇంట్లో నిమ్మకాయ ఉంటే దుస్తులపై అంటిన మరకలకు నిమ్మరసం పూసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. నూనె లేదా గ్రీజు మరకలను వెంటనే తొలగిస్తేనే ఫలితం ఉంటుంది. లేకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరకలు పాతవి అయ్యే కొద్దీ తొలగించడం కష్టమవుతుంది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jul 15 , 2025 | 09:18 PM