Share News

Hair Tips: రంగు వేసిన తర్వాత కూడా తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయా.. ఈ తప్పులు చేయకండి..

ABN , Publish Date - May 17 , 2025 | 09:53 AM

జుట్టుకు రంగు వేసిన తర్వాత కూడా తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయా.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.. మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత మీరు చేసే కొన్ని తప్పులు వల్ల మీ వెంట్రుకలు తెల్లగా కనిపిస్తాయి. ఆ తప్పులు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Hair Tips: రంగు వేసిన తర్వాత కూడా తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయా.. ఈ తప్పులు చేయకండి..
Hair Care Tips

ఈ రోజుల్లో జుట్టుకు రంగు వేయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసుల వారు తమ జుట్టుకు రంగు వేసుకుంటారు. కొంత మందికి జుట్టుకు రంగు వేసిన తర్వాత కూడా తెల్ల వెంట్రుకలు కనిపిస్తాయి.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత మీరు చేసే కొన్ని తప్పులు వల్ల మీ వెంట్రుకలు తెల్లగా కనిపిస్తాయి. ఆ తప్పులు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..


జుట్టును కప్పుకోకుండా ఎండలో బయటకు వెళ్లడం

జుట్టుకు రంగు వేసిన తరువాత.. మీరు బయటకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా తలకు ఏదైనా కప్పుకోండి. జుట్టుకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే.. సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాలు జుట్టు రంగుపై ప్రభావం చూపుతాయి. జట్టు రంగు తరగా వెలిసిపోయే అవకాశం ఉంటుంది. అందుకే.. మీరు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా మీ జుట్టును కవర్ చేసుకోండి. అంటే క్యాప్, క్లాత్‌తో గానీ కవర్ చేసుకోండి. లేదంటే యూవీ ప్రోటక్షన్ హెయిర్ స్ప్రేని ఉపయోగించండి.

వేడి నీటితో జుట్టు కడగడం

సాధారణంగా వేసవిలో అందరూ చల్లటి నీటితో స్నానం చేస్తారు. కానీ కొన్నిసార్లు ట్యాంక్‌లోని నీరు కూడా చాలా వేడిగా మారుతుంది. జుట్టుకు కలర్ వేసుకున్న వారు వేడి నీటితో తలస్నానం చేయడం మంచిది కాదు. ఎందుకంటే వేడి నీరు జుట్టు రంగును తొలగిస్తుంది.

షాంపూ వాడటం

హెయిర్ కలర్ వేసిన వెంటనే మీ జుట్టుకు షాంపూ వాడటం మంచిది కాదు. దీని కారణంగా రంగు త్వరగా పోతుంది. వారానికి రెండుసార్లు మాత్రమే షాంపూ వాడండి.

కండిషనర్ లేదా హెయిర్ మాస్క్ వాడకపోవడం

మీరు మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత కడిగినప్పుడల్లా కండిషనర్ వాడటం మర్చిపోవద్దు. అలా చేయకపోవడం వల్ల జుట్టు పొడిబారుతుంది. దీని వల్ల రంగు త్వరగా పోవచ్చు. దీనితో పాటు, జుట్టుకు డీప్ కండిషనింగ్ మాస్క్ కూడా వేయండి.

స్టైలింగ్ సాధనాల అధిక వినియోగం

మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత హెయిర్ డ్రైయర్, స్ట్రెయిట్నర్ లేదా కర్లింగ్ ఐరన్ ఎక్కువగా వాడటం వల్ల జుట్టు రంగు మసకబారుతుంది.


Also Read:

Viral Video: ఇలాంటి ఉద్యోగిని ఎక్కడైనా చూశారా.. బాస్‌కు ఎలా మస్కా కొడుతున్నాడంటే..

Blood pressure: రక్తపోటు.. అవయవాలకు చేటు

Lady finger: బెండకాయతో ఈ 5 ఆహార పదార్థాలును ఎప్పుడూ తినకండి..

Updated Date - May 17 , 2025 | 10:15 AM