Share News

High Divorces Rate: వామ్మో.. ఈ దేశాల్లో విడాకులు అత్యధికం.. ఇలా పెళ్లి.. అలా డైవర్స్

ABN , Publish Date - Aug 17 , 2025 | 10:06 PM

పెళ్లిపై యువత దృక్పథం మారుతోంది. ఫలితంగా అనేక దేశాల్లో విడాకుల సంఖ్య పెరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో అత్యధిక డైవర్స్‌ల కేసులు వెలుగు చూస్తున్న టాప్ 5 దేశాలు ఏవో ఈ కథనంలో చూద్దాం. ఇందుకు గల కారణాలను కూడా తెలుసుకుందాం.

High Divorces Rate: వామ్మో.. ఈ దేశాల్లో విడాకులు అత్యధికం.. ఇలా పెళ్లి.. అలా డైవర్స్
Highest Divorce Rates Globally

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిపై సమాజంలో అభిప్రాయాలు మారుతున్నాయి. ఇష్టం లేని వివాహంలో నరకం చవి చూసేకంటే వేరు కుంపటే బెటరని యువ జంటలు భావిస్తున్నాయి. ఫలితంగా అనేక దేశాల్లో విడాకులు సంఖ్య పెరుగుతోంది. డైవర్స్‌కు అనుకూలమైన చట్టాలు కూడా విడాకులు పెరగడానికి కారణమని కొందరు చెబుతున్నారు. మరి డైవర్స్ శాతం అత్యధికంగా ఉన్న టాప్-5 దేశాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

రష్యాలో డైవర్స్ శాతం అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్రతి 1000 మందికి సగటున 4.7 విడాకుల ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా.. ప్రపంచపు విడాకుల రాజధానిగా రష్యా చెడ్డ పేరు మూటగట్టుకుంది. దశాబ్దాలుగా ఇక్కడ విడాకుల రేటు పెరుగుతూనే ఉంది. ఆర్థిక అస్థిరత, సమాజంలో మార్పులు, పెళ్లిపై యువతలో మారుతున్న ధోరణి వంటివన్నీ పెళ్లిళ్లను పెటాకులు చేస్తున్నాయి. యువ జంటల్లో విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంది.

విడాకుల రేటు పరంగా రెండు స్థానంలో గ్వామ్ అనే ద్వీపం ఉంది. ఇది అమెరికాకు చెందిన ద్వీపం. ఇక్కడ డైవర్స్ రేటు 4.2 శాతంగా ఉంది. ఇక్కడి చట్టాల కారణంగా సులువుగా డైవర్స్ తీసుకునే అవకాశం ఉండటం వల్ల విడాకుల సంఖ్య పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


మాల్డోవాలో విడాకుల రేటు 3.7గా ఉంది. ఆర్థిక కష్టాల కారణంగా ఇక్కడి జనాలు ఎక్కువ సంఖ్యలో విడాకుల బాట పడుతున్నారు. కలిసి ఉండటం కంటే విడిపోయి ఉంటేనే ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు. పెళ్లి తరువాత జీవన ఖర్చులు భరించలేమని చెబుతున్నారు.

ఇక బెలారస్‌లో విడాకుల రేటు 3.4 శాతం. సమాజంలో మార్పుల కారణంగానే ఇక్కడ విడాకుల సంఖ్య పెరుగుతోంది. పెళ్లంటే జీవితాంతం నిలిచుండే బంధం అన్న భావన సడలుతోంది. ఇష్టం లేని బంధంలో కొనసాగటం కంటే తెగదెంపులు చేసుకోవడమే బెటరని యువ జంటలు భావిస్తున్నాయి. మెరుగైన బంధానికి డైవర్స్ తొలి అడుగుగా భావించేవారి సంఖ్య పెరుగుతోంది.

లాట్వియా దేశంలో డైవర్స్ రేటు 3.1 శాతంగా ఉంది. లాట్వియాలో కూడా సామాజిక విలువల్లో మార్పులే డైవర్స్‌లు పెరిగేలా చేస్తున్నాయి. జీవిత భాగస్వామి పట్ల బాధ్యత కంటే వ్యక్తిగత స్వేచ్ఛకే అనేక మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లిలో ఇమడలేమన్న భావన రాగానే మరో ఆలోచన లేకుండా వేరుపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

టమాటాలు కొన్న సన్నీ లియోనీకి షాకింగ్ అనుభవం.. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే..

బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..

Read Latest and Health News

Updated Date - Aug 17 , 2025 | 10:12 PM