Chanakya Neeti On Cooking: మహిళలు వంట చేసేటప్పుడు ఈ మూడు తప్పులు ఎప్పుడూ చేయకూడదు.!
ABN , Publish Date - Oct 25 , 2025 | 09:34 AM
స్త్రీలు వంట చేసేటప్పుడు ఈ మూడు తప్పులు చేయకూడదని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వివరించారు. ఎందుకంటే ఇది ఇంటి ఆనందం, శ్రేయస్సును నాశనం చేస్తుందని ఆయన చెప్పారు. కాబట్టి, వంట చేసేటప్పుడు మహిళలు ఏ మూడు తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో విజయం సాధించడానికి, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అనేక విషయాల గురించి మనకు చెప్పారు. అదేవిధంగా, స్త్రీలు వంట చేసేటప్పుడు ఈ మూడు తప్పులు చేయకూడదని కూడా చెప్పారు. ఎందుకంటే ఇది ఇంటి ఆనందం, శ్రేయస్సును నాశనం చేస్తుందని తెలిపారు. కాబట్టి, వంట చేసేటప్పుడు మహిళలు ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
వంట చేసేటప్పుడు మాట్లాడటం :
ఆచార్య చాణక్యుడి ప్రకారం, స్త్రీ వంట చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు లేదా ఆమె దృష్టి మరల్చే ఏ పని చేయకూడదు. ఎందుకంటే, ఇలా చేయడం వల్ల వంటలు రూచిగా ఉండకపోవచ్చు. రుచికరంగా లేని ఆహారం వల్ల కుటుంబ సభ్యులు తినడానికి ఇబ్బంది పడుతారు. అంతేకాకుండా, వంట రుచిగా లేకపోతే ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి, స్త్రీ దృష్టి వంటపై మాత్రమే ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
స్నానం చేయకుండా వంట చేయడం :
వంటగదిలోకి ప్రవేశించినప్పుడు స్త్రీలు శుభ్రంగా ఉండాలని చాణక్యుడు చెప్పారు. స్నానం చేయకుండా వంట చేయడం అపవిత్రం. స్నానం చేయకుండా వంట చేయడం, అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ తప్పు మొత్తం ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాపింపించేలా చేస్తుందని, పురోగతిని అడ్డుకుంటుందని చాణక్యుడు చెప్పారు.
కోపంతో వంట చేయడం :
చాలా సార్లు ఇంట్లో తగాదాలు జరిగినప్పుడు, మహిళలు కొంచెం విచారంగా ఉంటారు. అయితే, విచారంగా లేదా బాధలో ఉన్నప్పుడు ఎప్పుడూ వంట చేయకూడదు. ఎందుకంటే కోపంతో లేదా విచారంగా వంట చేసినప్పుడు, ఆహారం రుచిని ప్రభావితం చేస్తుంది. అలాంటి ఆహారం తింటే కుటుంబంలో విభేదాలు వస్తాయి. కాబట్టి వంట చేసేటప్పుడు, స్త్రీల మనస్సు ప్రశాంతంగా ఉండాలని, ఆనందంతో వంట చేయాలని చాణక్యుడు సూచించారు.
Also Read:
శీతాకాలంలో పసుపు నీరు తాగితే ఏమవుతుంది? నిపుణులు ఏమంటున్నారంటే..
మీరు ఎప్పుడైనా రివర్స్‌లో నడిచారా.. ఇలా నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!
For More Latest News