Things Which Annoy Boss: ఆఫీసులో ఇలా చేస్తే మీ బాస్‌కు తిక్కరేగడం పక్కా
ABN , Publish Date - Apr 20 , 2025 | 10:22 PM
ఉద్యోగులకు ఉండే కొన్ని అలవాట్ల కారణంగా బాస్‌లకు తిక్క రేగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆర్గనైజేషనల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసులో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పై అధికారులతో శభాష్ అనిపించుకోవాలని అనుకుంటారు. అయితే, ఉద్యోగులకు ఉండే కొన్ని అలవాట్ల కారణంగా వారికి తెలీకుండానే బాస్‌లకు చిరాకు తెప్పిస్తుంటారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నిత్యం ఆఫీసుకు లేటుగా రావడం లేదా సమావేశాల్లో ఇతరులతో అమర్యాదగా వ్యవహరించడం సబబు కాదు. మీటింగ్ మొదలయ్యాక మధ్య అందరికీ అంతరాయం కలిగిస్తూ వచ్చి కూర్చొనే ఉద్యోగులను చూస్తే బాస్‌లకు చిరాకు పక్కా
సహోద్యోగులతో మంచి సంబంధబాంధ్యవాలు నెరపడం అవసరమే కానీ ఆ పేరిట పనిని పక్క పెట్టి నిత్యం వదంతులు ఊహాగానాల గురించి చర్చించుకోవడం బాస్ కంట పడితే సమస్యలు తప్పవు. కాని పనివేళ్లల్లో వీలైనంత తక్కువగా సహోద్యోగులతో మాట్లాడుతూ అలర్ట్‌గా పనిప దృష్టి పెట్టడం శ్రేయస్కరం
ప్రతి చిన్న సమస్య పరిష్కారానికి బాస్ సాయం కోరడం కూడా వారికి చిరాకు తెప్పిస్తుంది. వారి సమయాన్ని వృథా చేసినట్టు అవుతుంది. కాబట్టి కొన్ని సమస్యలకైనా పరిష్కారాలతో సిద్ధంగా ఉంటే బాస్‌లకు ఉద్యోగులపై సదభిప్రాయం కలుగుతుంది.
సమావేశాల్లో ఉద్యోగులు కనీస మర్యాదలు పాటించకపోతే బాస్‌కు తిక్క రేగుతుంది. మీటింగ్‌లకు పూర్తిస్థాయి సన్నద్ధతతో రావడం, అవతలి వారు చెప్పేది శ్రద్ధగా వినడం, నిర్మాణాత్మక సూచనలు సలహాలు ఇవ్వడం ఉద్యోగులకు మేలు చేస్తాయి. బాస్ దృష్టిలో మంచి మార్కులు పడేలా చేస్తాయి.
ఏ పని అప్పగించినా డెడ్‌లైన్ మిస్సయ్యే ఉద్యోగులను బాస్‌లు అస్సలు సహించరు. ఒక్క రిపోర్టు లేటుగా ఇచ్చినా కూడా ఆ ప్రభావం మొత్తం ప్రాజెక్టుపై పడుతుంది. ఇక సహోద్యోగులకు, బాస్‌కు చిరాకు తెప్పిస్తుంది.
పనికి సంబంధించిన విషయాల్లో చొరక చూపకపోవడం, నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం కూడా బాస్‌లకు కోపం తెప్పిస్తుంది. కాబట్టి, కొత్త ఆలోచనలు ఏమైనా ఉంటే మీటింగ్‌లల్లో పంచుకోవాలి. మంచి సూచనలు సలహాలు ఇచ్చేలా సిద్ధమయ్యి రావాలి.
ఉద్యోగులు నిత్యం పొరపాట్లు చేయడం ఆపై సాకులతో సిద్ధంగా ఉండటం, చేసిన తప్పును సమర్థించుకోవడం కూడా బాస్‌లకు కోపం తెప్పిస్తుంది. కాబట్టి, ప్రొఫెషనల్‌గా, నియమనిబద్ధలతో ఆఫీసుల్లో వ్యవహరించాలి.
బాస్ ఇచ్చే సూచనలు, సలహాలు అమలుపర్చకపోయినా చిక్కుల్లో పడకతప్పదు. నిర్మాణాత్మక విమర్శను హుందాగా స్వీకరించకుండా రక్షణాత్మక ధోరణిలో స్పందిస్తే చిక్కులు తప్పవు
ఇవి కూడా చదవండి:
కాబోయే భర్తపై ప్రియుడితో దాడి చేయించిన యువతి.. కోమాలో బాధితుడు
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు
వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..