Share News

US Visa Rules: సోషల్‌ ఖాతాలు చెక్‌ చేశాకే వీసాల జారీ

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:04 AM

వీసాల మంజూరులో అమెరికా మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇక నుంచి దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను తనిఖీ చేయనుంది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

US Visa Rules: సోషల్‌ ఖాతాలు చెక్‌ చేశాకే వీసాల జారీ

వాషింగ్టన్‌, జూన్‌ 23: వీసాల మంజూరులో అమెరికా మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇక నుంచి దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను తనిఖీ చేయనుంది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నూతన విధానం తక్షణమే అమల్లోకి రానుంది. ఎఫ్‌, ఎం, జె తరహా నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాకు దరఖాస్తు చేసేవారు ఒక నుంచి తమ సామాజిక మాధ్యమాల ఖాతాల్లోని ప్రైవసీ సెట్టింగ్‌లను ‘పబ్లిక్‌’ అని మార్చాల్సి ఉంటుంది. తమ గుర్తింపును బహిర్గతం చేయడానికి ఇది తప్పనిసరి. దీనిని చూసిన తరువాతనే అమెరికా చట్టాల ప్రకారం వారిని అమెరికాలోకి అనుమతించవచ్చా, లేదా అని నిర్ణయిస్తారు. ఇదే విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఎక్స్‌ ద్వారా తెలిపింది. వ్యక్తిగత సోషల్‌ మీడియాలోని ప్రైవసీ సెట్టింగ్స్‌ను ‘పబ్లిక్‌’కు మార్చుకోవాలని పేర్కొంది.

Updated Date - Jun 24 , 2025 | 03:05 AM