Share News

The US Is Seeking India Assistance: చైనాను ఎదుర్కోవడానికి భారత్‌ సాయం కావాలి

ABN , Publish Date - Oct 16 , 2025 | 05:53 AM

భారత్‌పై అడ్డగోలుగా 50శాతం సుంకాలు విధించిన అమెరికా.. ఇప్పుడు చైనాను ఎదుర్కొనేందుకు మాత్రం భారత్‌ సాయం కావాలని కోరుకుంటోంది.

The US Is Seeking India Assistance: చైనాను ఎదుర్కోవడానికి భారత్‌ సాయం కావాలి

  • అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌, అక్టోబరు 15: భారత్‌పై అడ్డగోలుగా 50శాతం సుంకాలు విధించిన అమెరికా.. ఇప్పుడు చైనాను ఎదుర్కొనేందుకు మాత్రం భారత్‌ సాయం కావాలని కోరుకుంటోంది. అమెరికాలోని టెక్‌, రక్షణ, వాహన కంపెనీలకు అత్యంత కీలకమైన అరుదైన లోహాల సరఫరాపై చైనా నియంత్రణలు విధించడమే దీనికి కారణం. అమెరికాలో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడుతూ..‘‘ఇది చైనాకు, ప్రపంచానికి మధ్య జరుగుతున్న పోరు. మొత్తం ప్రపంచ పారిశ్రామిక, పంపిణీ వ్యవస్థలపైనే చైనా బల్లెం ఎక్కుపెట్టింది. అది మనల్ని నియంత్రించలేదు. దీనిపై మేం మా మిత్రదేశాలతో మాట్లాడుతున్నాం. ఈ వారంలో సమావేశం కాబోతున్నాం. ఈ అంశంలో యూరప్‌ దేశాలు, భారత్‌తోపాటు ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాల సహకారం కోరుతున్నాం. అమెరికా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుంటే.. చైనా యుద్ధానికి దిగుతోంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాలో 90ు చైనా నుంచే జరుగుతుంది. పలు దేశాల్లో అరుదైన ఖనిజాలు దొరికినా.. వాటిని ప్రాసెస్‌ చేసి, లోహాలుగా మార్చే సామర్థ్యం చైనాకు మాత్రమే ఉంది. అలాంటి వాటిపై చైనా నియంత్రణ విధించడంతో అమెరికా గందరగోళంలో పడింది. ఈ క్రమంలోనే నవంబర్‌ 1 నుంచి చైనాపై 100శాతం అదనపు టారి్‌ఫలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

Updated Date - Oct 16 , 2025 | 06:10 AM