Ranjani Srinivasan: రంజనీ శ్రీనివాసన్ అమెరికా వీసా రద్దు
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:21 AM
ఉగ్రవాద సంస్థ హమా్‌సకు అనుకూలంగా ఆమె వ్యవహరించిన కారణంగా అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె స్వచ్ఛందంగా స్వదేశానికి మంగళవారం తిరిగి వెళ్లారని హోమ్‌ల్యాండ్ భద్రతా శాఖ వెల్లడించింది.

హమాస్ అనుకూల కార్యక్రమాలపై చర్యలు
వాషింగ్టన్, మార్చి 15: కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం వారం క్రితం రద్దు చేసింది. ఉగ్రవాద సంస్థ హమా్‌సకు అనుకూలంగా ఆమె వ్యవహరించిన కారణంగా అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె స్వచ్ఛందంగా స్వదేశానికి మంగళవారం తిరిగి వెళ్లారని హోమ్‌ల్యాండ్ భద్రతా శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎయిర్‌పోర్టులో ఆమె విమానం ఎక్కుతున్నప్పటి ఓ వీడియోను విడుదల చేసింది.