Share News

US Ends Dropbox Facility: డ్రాప్‌బాక్స్‌ వీసా రెన్యువల్‌కు అమెరికా స్వస్తి

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:11 AM

ఇంటర్వ్యూ లేకుండా వీసా రెన్యువల్స్‌ కోసం తీసుకొచ్చిన డ్రాప్‌బాక్స్‌ సదుపాయానికి అమెరికా స్వస్తి చెప్పింది. ...

US Ends Dropbox Facility: డ్రాప్‌బాక్స్‌ వీసా రెన్యువల్‌కు అమెరికా స్వస్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఇంటర్వ్యూ లేకుండా వీసా రెన్యువల్స్‌ కోసం తీసుకొచ్చిన ‘డ్రాప్‌బాక్స్‌’ సదుపాయానికి అమెరికా స్వస్తి చెప్పింది. వీసా దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. వర్క్‌, స్టూడెంట్‌ కేటగిరీలతో పాటు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసం ప్రస్తుతం డ్రాప్‌బాక్స్‌ సదుపాయం అందుబాటులో ఉంది. క్లీన్‌ వీసా హిస్టరీ ఉన్నా కూడా ఇకపై చాలా కేటగిరీల్లోని వీసా దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ కొత్త మార్పు వచ్చే నెల 2 నుంచి అమల్లోకి రానుంది. ఈ డ్రాప్‌బాక్స్‌ను ఎక్కువగా వినియోగించుకుంటున్న భారతీయులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపై కేవలం దౌత్య, అధికారిక వీసాలైన ఏ, జీ, నాటో, టెక్రో వీసాలకు మాత్రమే డ్రాప్‌బాక్స్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కఠినమైన రూల్స్‌తో కొద్ది సంఖ్యలో బీ1, బీ2 పర్యాటక, బిజినెస్‌ వీసాల రెన్యువల్‌కు డ్రాప్‌బాక్స్‌ను కొనసాగిస్తారు.

Updated Date - Aug 14 , 2025 | 03:11 AM