అక్రమ వలసదార్లపై అమెరికా ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:54 AM
అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కు పాదం మోపుతోంది. మంగళవారం ఒక్క రోజునే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ 2,200 మందిని అరెస్టు చేసింది.
ఒకే రోజున 2200 మంది అరెస్టు
వాషింగ్టన్, జూన్ 5: అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కు పాదం మోపుతోంది. మంగళవారం ఒక్క రోజునే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ 2,200 మందిని అరెస్టు చేసింది. రోజుకు కనీసం 3,000 మందిని అదుపులోకి తీసుకోవాలని హోంలాండ్ సెక్రటరీ ఆదేశించిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఆల్టర్నేటి వ్ టు డిటెన్షన్ (ఏటీడీ) ప్రోగ్రాం కింద తొలుత వీరి పేర్లను నమోదు చేశారు.
ఇలాంటి వారిని ముప్పుగా పరిగణించనప్పటికీ మోకాళ్లకు మోనిటర్లు బిగించడంతో పాటు స్మార్ట్‌ఫోన్ యాప్‌లు, గూగుల్ లోకేషన్ ద్వారా వీరిపై నిఘా పెడుతారు. కానీ ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి రావాలంటూ అందరికీ మెసేజ్‌లు పెట్టారు. అందరూ అక్కడికి వచ్చిన తరువాత అరెస్టు చేశారు. అందులో ఏడుగురికి బేడీలు వేసి కారులో కూర్చోబెట్టారు.