Trump Administration Government Employee: అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపును నిలిపివేసిన కోర్టు
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:47 AM
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ యంత్రాంగం నిర్ణయాన్ని అక్కడి కోర్టు నిలిపివేసింది.
వాషింగ్టన్, అక్టోబరు 16: అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ యంత్రాంగం నిర్ణయాన్ని అక్కడి కోర్టు నిలిపివేసింది. అమెరికా బడ్జెట్‌కు సెనేట్ ఆమోదం తెలపకపోవడంతో రెండు వారాలుగా ‘ప్రభుత్వ షట్‌డౌన్’ పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 4 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన ట్రంప్ యంత్రాంగం.. మరికొందరిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఘం కోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాగా, వివిధ దేశాలపై అడ్డగోలు టారి్‌ఫలు విధించడం సరికాదంటూ అమెరికా సుప్రీంకోర్టుకు చేరిన పిటిషన్‌పై నవంబరు 5న వాదనలు జరగనున్నాయి. వాదనలను వీక్షించడానికి తాను అమెరికా సుప్రీంకోర్టుకు హాజరవుతానని ట్రంప్ వెల్లడించారు.