Share News

US Cancels Visas: 6 వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:04 AM

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ సర్కారు కొరడా ఝుళిపిస్తోంది. చట్టాలను ఉల్లంఘించడంతో పాటు దేశంలో అనధికారికంగా ఎక్కువ కాలం ...

US Cancels Visas: 6 వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

  • ట్రంప్‌ సర్కారు తాజా నిర్ణయం

  • చట్టాల్ని ఉల్లంఘించారంటూ ఆరోపణ

  • పాలస్తీనాకు మద్దతు తెలిపినందుకు కూడా పలువురిపై వేటు

వాషింగ్టన్‌, ఆగస్టు 19: అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ సర్కారు కొరడా ఝుళిపిస్తోంది. చట్టాలను ఉల్లంఘించడంతో పాటు దేశంలో అనధికారికంగా ఎక్కువ కాలం నివసించడం తదితర కారణాలతో ఆ దేశ విదేశాంగ శాఖ 6 వేల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థి వీసాలను రద్దు చేసింది. వీరిలో ఎక్కువ శాతం మంది దాడులు, దోపిడీలకు పాల్పడటం, డ్రగ్స్‌, మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం, ఉగ్రవాదానికి మద్దతు పలకడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు బీబీసీ కథనం పేర్కొంది. వీసాలు రద్దయిన 6వేల మందిలో 4వేల మంది చట్టాలను ఉల్లంఘించారని, మరో 200 నుంచి 300 మంది వరకూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిననట్లు వివరించింది. ఉగ్రవాదానికి మద్దతు పలకడం అంటే ఏమిటో విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వనప్పటికీ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు తెలిపిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓపెన్‌ డోర్స్‌ సంస్థ నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో 210కి పైగా దేశాల నుంచి 11లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు అమెరికాలోని కాలేజీల్లో చేరారు.

Updated Date - Aug 20 , 2025 | 04:04 AM