Share News

US and India Relations: మోదీని ట్రంప్‌ అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు

ABN , Publish Date - Oct 12 , 2025 | 06:12 AM

భారత్‌తో బంధాన్ని అమెరికా ఎంతో విలువైనదిగా భావిస్తుందని, ప్రధాని మోదీని అధ్యక్షుడు ట్రంప్‌ అత్యంత సన్నిహితుడిగా భావిస్తారని ఆ దేశ రాయబారి సెర్గియో గోర్‌ చెప్పారు......

US and India Relations: మోదీని ట్రంప్‌ అత్యంత   సన్నిహితుడిగా భావిస్తారు

  • అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, అక్టోబరు 11: భారత్‌తో బంధాన్ని అమెరికా ఎంతో విలువైనదిగా భావిస్తుందని, ప్రధాని మోదీని అధ్యక్షుడు ట్రంప్‌ అత్యంత సన్నిహితుడిగా భావిస్తారని ఆ దేశ రాయబారి సెర్గియో గోర్‌ చెప్పారు. భారత్‌లో ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌-మోదీ ఉన్న చిత్రపటాన్ని ఆయన ప్రధానికి బహూకరించారు. రక్షణ, వాణిజ్యం, అరుదైన ఖనిజాల గురించి మోదీతో చర్చించినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌, విదేశాంగ కార్యదర్శి మిస్రీతోనూ తాను సమావేశమైనట్లు గోర్‌ తెలిపారు. గోర్‌తో సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. గోర్‌ హయాంలో భారత్‌-అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రంప్‌ సుంకాలతో భారత్‌-అమెరికా మధ్య సంబంధాల్లో ఘర్షణ నెలకొన్న తరుణంలో గోర్‌ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - Oct 12 , 2025 | 06:55 AM