Share News

Deport Now Appeal Later Policy: ముందు బహిష్కరణ.. తర్వాత అప్పీల్‌

ABN , Publish Date - Aug 13 , 2025 | 03:34 AM

బ్రిటన్‌లో నేరం చేసి శిక్ష పడ్డాక కూడా అప్పీల్‌ చేసి అక్కడే గడిపేద్దామనుకునే భారతీయులకు ఇక ఆ అవకాశం లేదు. ..

Deport Now Appeal Later Policy: ముందు బహిష్కరణ.. తర్వాత అప్పీల్‌

  • విదేశీ నేరగాళ్లపై బ్రిటన్‌ తక్షణ చర్యలు

లండన్‌, ఆగస్టు 12: బ్రిటన్‌లో నేరం చేసి శిక్ష పడ్డాక కూడా అప్పీల్‌ చేసి అక్కడే గడిపేద్దామనుకునే భారతీయులకు ఇక ఆ అవకాశం లేదు. యూకే అమలు చేస్తున్న ‘తక్షణ బహిష్కరణ, తర్వాత అప్పీల్‌ (డిపోర్ట్‌ నౌ, అప్పీల్‌ లేటర్‌)’ విధానంలో ఉన్న దేశాల జాబితాలోకి భారత్‌ను కూడా చేర్చడమే అందుకు కారణం. విదేశీ నేరగాళ్ల కోసం తీసుకొచ్చిన ఈ విధానాన్ని ఇప్పటికే 8 దేశాలకు బ్రిటన్‌ అమలు చేస్తోంది. తాజాగా ఆ జాబితాలో భారత్‌ సహా 15 దేశాలను చేర్చింది. ఈ 23 దేశీయులెవరైనా బ్రిటన్‌లో నివసిస్తూ ఏదైనా నేరం చేసి అది నిరూపణ అయితే వెంటనే ఆ నేరగాళ్లను వారి దేశానికి తిప్పిపంపుతారు. తమ బహిష్కరణపై అప్పీల్‌ చేయడం ద్వారా వారు బ్రిటన్‌లోనే ఉందామని అనుకుంటే ఇకపై కుదరదు. అయితే ఆ అప్పీల్‌పై విచారణకు వారు స్వదేశం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుకావాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు, హంతకులు, జీవిత ఖైదు పడ్డవాళ్లు ముందు బ్రిటన్‌లో వారికి పడ్డ శిక్షను పూర్తిగా అనుభవించాలి. ఆ తర్వాతే వారి బహిష్కరణను పరిశీలిస్తారు.

Updated Date - Aug 13 , 2025 | 03:34 AM