Share News

Typhoon Kammuri : ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన తుఫాను.. 241మంది మృతి

ABN , Publish Date - Nov 07 , 2025 | 04:57 AM

ఫిలిప్పీన్స్‌పై విరుచుకుపడిన కల్మేగీ తుఫాను ఆ దేశాన్నికుదిపేసింది.

Typhoon Kammuri : ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన తుఫాను.. 241మంది మృతి

మనీలా, నవంబర్‌ 6: ఫిలిప్పీన్స్‌పై విరుచుకుపడిన కల్మేగీ తుఫాను ఆ దేశాన్నికుదిపేసింది. తుఫాను ధాటికి 241మంది మరణించగా, 127మంది గల్లంతయ్యారు. చాలా మరణాలు ఆకస్మిక వరదల్లో మునిగిపోవడం వల్లే సంభవించాయని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో ముఖ్యంగా సెబూ ప్రావిన్స్‌ విపరీతమైన నష్టాన్ని చవిచూసింది. ఈ నగరంలో ఒకేరోజులో దాదాపు ఒకటిన్నర నెలల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వరదలు నివాస ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో దేశ అధ్యక్షుడు మార్కోస్‌ జూనియర్‌ దేశవ్యాప్తంగా అత్యవసర స్థితిని ప్రకటించారు.

Updated Date - Nov 07 , 2025 | 04:57 AM