ప్రిన్స్ హ్యారీని అమెరికా నుంచి తిప్పిపంపం
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:31 AM
ఆయన వలస వచ్చిన విధానాన్ని సవాలు చేస్తూ కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆయనకు ఇప్పటికే భార్యతో బోలెడు సమస్యలు: ట్రంప్
వాషింగ్టన్, ఫిబ్రవరి 9: కుటుంబ కారణాల నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీపై అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆయన వలస వచ్చిన విధానాన్ని సవాలు చేస్తూ కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘హ్యారీపై ఎలాంటి చర్యలు తీసుకోను. ఆయనను ఒంటరిగా వదిలేయండి. భార్యతో ఇప్పటికే ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆమె చాలా టెరిబుల్’’ అని అన్నారు. తాను గతంలో మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు ప్రిన్స్ హ్యారీ తన జీవిత కథలో రాసుకున్నారు. కానీ ఆ విషయాన్ని వీసా దరఖాస్తులో వెల్లడించలేదని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ కేసు పెట్టింది. దీనిపైనే ట్రంప్‌ను ప్రశ్నించగా ఆయనను అమెరికా నుంచి తిప్పి పంపించేది లేదని చెప్పారు.