Share News

Trump Warns Russia: రష్యా యుద్ధం ముగించకుంటే ఉక్రెయిన్‌కు తొమాహక్‌ క్షిపణులిస్తాం ట్రంప్‌

ABN , Publish Date - Oct 14 , 2025 | 03:36 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

Trump Warns Russia: రష్యా యుద్ధం ముగించకుంటే ఉక్రెయిన్‌కు   తొమాహక్‌ క్షిపణులిస్తాం ట్రంప్‌

  • రష్యా యుద్ధం ముగించకుంటే ఉక్రెయిన్‌కు

  • తొమాహక్‌ క్షిపణులిస్తాం: ట్రంప్‌

  • రష్యాకు ట్రంప్‌ గట్టి హెచ్చరిక

వాషింగ్టన్‌, అక్టోబరు 13: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీలైనంత పరిష్కరించుకోకుంటే కీవ్‌కు దీర్ఘశ్రేణి తొమాహక్‌ క్షిపణులను అందజేస్తామన్నారు. ఈ క్షిపణులు యుద్ధంలో దూకుడుకు మారు పేరని అభివర్ణించారు. తమ కీలక ఆయుధ వ్యవస్థ ద్వారా పుతిన్‌ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఏ మాత్రం వెనకాబోమని ట్రంప్‌ సూచనప్రాయంగా తెలిపారు. ‘ఇప్పటికైనా ఈ యుద్ధం పరిష్కారం కాకపోతే నేను వారికి తొమాహక్‌లను పంపిస్తాను. తొమాహక్‌ ఒక అద్భుత ఆయుధం. చాలా ప్రమాదకరమైంది కూడా.. కానీ రష్యా అంతదూరం తెచ్చుకోదని భావిస్తున్నాను. మిస్టర్‌ పుతిన్‌ ఇప్పటికైనా దీన్ని పరిష్కరించుకుంటే ఆయనకే మంచిది’ అని అన్నారు. ఆదివారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్‌కు తొమాహక్‌లను ఇస్తే.. అణ్వాయుధాలను ఇచ్చినట్లే భావిస్తామని తెలిపింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్‌ మాట్లాడుతూ.. ‘ఈ క్షిపణుల సరఫరా అనేది ట్రంప్‌తో సహా అందరికీ పీడకలలా మారవచ్చు. అణ్వాయుధాలను మోసుకెళ్లే తొమాహక్‌ క్షిపణులను ప్రయోగించిన తర్వాత.. వాటికీ సంప్రదాయ క్షిపణులకు తేడా గుర్తించడం అసాధ్యం. సూటిగా చెప్పాలంటే తొమాహక్‌లను మాస్కో అణ్వాయుధాలుగానే భావిస్తోంది. అందుకు తగినట్లుగానే ప్రతిస్పందిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Oct 14 , 2025 | 03:36 AM