Share News

Trump India tariffs: అలా అయితే భారత్ టారిఫ్‌లు కడుతూ ఉండాల్సిందే.. ట్రంప్ మరో వార్నింగ్..

ABN , Publish Date - Oct 20 , 2025 | 10:31 AM

చైనాపై టారిఫ్‌ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మాత్రం అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపకపోతే భారత్ సుంకాలు చెల్లిస్తూనే ఉండాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

Trump India tariffs: అలా అయితే భారత్ టారిఫ్‌లు కడుతూ ఉండాల్సిందే.. ట్రంప్ మరో వార్నింగ్..
Trump India tariffs

చైనాపై టారిఫ్‌ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మాత్రం అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపకపోతే భారత్ సుంకాలు చెల్లిస్తూనే ఉండాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌పై సుంకాల గురించి ట్రంప్‌ను జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు (Russian oil imports).


భారత్‌ త్వరలోనే రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని మరోసారి ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించడంపై ట్రంప్‌ను జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. 'ఒకవేళ వారు అలాగే చెప్పాలనుకుంటే (మోదీ-ట్రంప్ ఫోన్‌కాల్ గురించి).. వారు భారీ స్థాయిలో సుంకాలు చెల్లిస్తూనే ఉండాలి. కానీ, భారత్ అలా చేయబోదని అనుకుంటున్నా' అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు (India US trade tensions).


గత వారం ట్రంప్ వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చినట్టు తెలిపారు (Trump on India). ఈ మేరకు తామిద్దరం ఫోన్‌కాల్‌లో మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ట్రంప్, మోదీ ఫోన్‌లో మాట్లాడుకోలేదని స్పష్టత ఇచ్చింది. దేశీయంగా వినియోగదారుల ప్రయోజనం మేరకే రష్యా చమురు కోనుగోలు విషయంలో నిర్ణయం తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

వెనక్కి తగ్గిన ట్రంప్.. చైనాపై సుంకాల గురించి ట్రంప్ ఏమన్నారంటే..

భారత్‌తో దోస్తీకి బ్రెజిల్ ఆసక్తి.. ఇరు దేశాలు కలిసి నడిస్తే..



మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 20 , 2025 | 10:36 AM