Share News

Donald Trump: ట్రంప్‌ నోట మళ్లీ జీరో టారిఫ్‌

ABN , Publish Date - May 18 , 2025 | 05:18 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి భారత్‌పై సుంకాలు తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, వాణిజ్య ఒప్పందంపై తాము తొందరపడడం లేదని కూడా తెలిపారు.

Donald Trump: ట్రంప్‌ నోట మళ్లీ జీరో టారిఫ్‌

భారత్‌ సుంకాలను 100% తగ్గించనుందని పునరుద్ఘాటన.. గతంలోనే తోసిపుచ్చిన భారత్‌

పాలస్తీనా ప్రజలంతా లిబియాకు?

ట్రంప్‌ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం

గాజాను అభివృద్ధి చేస్తానని గతంలో ట్రంప్‌ ప్రకటన

మాతృభూమిని రక్షించుకునేందుకు..

ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న హమాస్‌

న్యూయార్క్‌, మే 17: భారత సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100ు సుంకాలను తగ్గించుకోవడానికి భారత్‌ సిద్ధంగా ఉందంటూ మళ్లీ మొదటికొచ్చారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కోసం తానేమి తొందరపడటం లేదని చెప్పారు. తాజాగా ఓ న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి. అయితే, ప్రతీకార సుంకాల నేపథ్యంలో అమెరికాకు 100% సుంకాలు తగ్గించుకునేందు(జీరో టారి్‌ఫల)కు సిద్ధంగా ఉన్నారు.

2trump.jpg

ఆ దేశంతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ విషయంలో నాకేం తొందరలేదు’ అని వ్యాఖ్యానించారు. భారత్‌ అమెరికాపై సుంకాలను పూర్తిగా తగ్గించనుందంటూ ట్రంప్‌ గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేయగా భారత్‌ తోసిపుచ్చింది.


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 05:18 AM