Trump: అమెరికా టాప్ కమాండర్ బ్రౌన్‌కు ఉద్వాసన
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:56 AM
బ్రౌన్ స్థానంలో ఎయిర్‌ఫోర్స్ రిటైర్డు లెఫ్టినెంట్ జనరల్ డాన్ రజిన్ కైనేను నియమిస్తున్నట్టు ప్రకటించారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు నాయకత్వం వహించిన నల్లజాతి జనరళ్లలో బ్రౌన్ రెండోవారు.

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అమెరికా మిలిటరీ టాప్ కమాండర్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ చీక్యూ బ్రౌన్ జూనియర్‌ను అధ్యక్షుడు ట్రంప్ ఆ పదవినుంచి తొలగించారు. బ్రౌన్ స్థానంలో ఎయిర్‌ఫోర్స్ రిటైర్డు లెఫ్టినెంట్ జనరల్ డాన్ రజిన్ కైనేను నియమిస్తున్నట్టు ప్రకటించారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు నాయకత్వం వహించిన నల్లజాతి జనరళ్లలో బ్రౌన్ రెండోవారు. ఆయన పదహారు నెలలు ఈ పదవిలో ఉన్నారు. నల్లజాతికి చెందిన జార్జి ఫ్లాయిడ్‌ను శ్వేత జాతి పోలీస్ అధికారి హత్యచేసిన ఘటనకు నిరసనగా అప్పట్లో జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి బ్రౌన్ మద్దతు పలికారు. ఇదిలా ఉండగా, అమెరికా ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కశ్యప్ పటేల్.. భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.