Trump: వైట్‌హౌ్‌సలోకి తనయుడితో మస్క్
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:46 AM
డోజ్‌ను సంప్రదించిన తర్వాతే కొత్త నియామకాలు చేపట్టాలని అమెరికాలోని ఫెడెరల్ ఏజెన్సీలను ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. అవసరమైన మేరకే సిబ్బందిని నియమించుకోవాలన్నారు.

వాషింగ్టన్, ఫిబ్రవరి 12: ఎలాన్ మస్క్ నేతృత్వం వహిస్తున్న డోజ్ విభాగానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని అధికారాలు కట్టబెట్టారు. డోజ్ విభాగం సూచిస్తే ఆ మేరకు సిబ్బందిలో కోత విధించాలని, డోజ్‌ను సంప్రదించిన తర్వాతే కొత్త నియామకాలు చేపట్టాలని అమెరికాలోని ఫెడెరల్ ఏజెన్సీలను ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. అవసరమైన మేరకే సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఆ సమయంలో ఎలాన్ మస్క్ ట్రంప్ పక్కనే ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక మస్క్ తొలిసారి మంగళవారం వైట్ హౌస్‌కు వచ్చారు. వెంట తన నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి పక్కన మస్క్ తన కొడుకును భుజాలపై ఎత్తుకున్న ఫొటో,సరాదాగాఉన్న వీడియోవైరల్ అవుతున్నాయి.