Share News

India-Pakistan Peace: ఐదు యుద్ధాలు ఆపా.. నన్ను అంతమాట అంటావా?

ABN , Publish Date - Aug 04 , 2025 | 07:12 AM

India-Pakistan Peace: చార్లెమాగ్నేను ట్రంప్ కోడలు లారా ట్రంప్..‘ట్రంప్ పాలనకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు?’ అని అడిగింది. ఇందుకు చార్లెమాగ్నే సమాధానం ఇస్తూ..‘నేను అస్సలు మంచి రేటింగ్ ఇవ్వను. మాలాంటి వాళ్లు చాలా ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు’అని అన్నాడు.

India-Pakistan Peace: ఐదు యుద్ధాలు ఆపా.. నన్ను అంతమాట అంటావా?
India-Pakistan Peace

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిట్టల దొరను మించిపోయారు. తాను అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే చాలా దేశాల మధ్య యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్నారు. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం గురించి పదే పదే.. ఎక్కడ పడితే అక్కడ ప్రస్తావిస్తున్నారు. రెండు దేశాల మధ్య తానే యుద్ధం ఆపానని చెప్పుకుంటున్నారు. తాజాగా, అమెరికాకు చెందిన ప్రముఖ రేడియో హోస్ట్ ‘చార్లెమాగ్నే ది గాడ్’ డొనాల్డ్ ట్రంప్‌పై దారుణమైన కామెంట్లు చేశాడు. అది కూడా ట్రంప్ కోడలు వ్యాఖ్యాతగా వ్యవహరించిన షోలో ట్రంప్ పరిపాలన చెత్తగా ఉందని అన్నాడు.


చార్లెమాగ్నేను ట్రంప్ కోడలు లారా ట్రంప్..‘ట్రంప్ పాలనకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు?’ అని అడిగింది. ఇందుకు చార్లెమాగ్నే సమాధానం ఇస్తూ..‘నేను అస్సలు మంచి రేటింగ్ ఇవ్వను. మాలాంటి వాళ్లు చాలా ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు’అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘అతడు తెలివి తక్కువ మనిషి. అతడి నోటినుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో అతడికి కూడా తెలీదు.


నా గురించి కానీ, నేను చేసిన పనుల గురించి కొంచెం కూడా తెలీదు. ఐదు యుద్ధాలను ఆపాను. కాంగో, రువాండాల మధ్య 31 ఏళ్లుగా నడుస్తున్న యుద్ధాన్ని ఆపాను. ఆ యుద్ధంలో 7 మిలియన్ల మంది చనిపోయారు. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆపాను. ఇరాన్ న్యూక్లియర్ సైట్లను తుడిచిపెట్టా. అమెరికాను ఆర్థికంగా గొప్పగా తీర్చిదిద్దా. జో బైడెన్ అమెరికా చెత్త అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ చార్లెమాగ్నే నిద్రమత్తు జో బైడెన్, కమల హ్యారీష్‌లకు ఓటు వేస్తాడా? గుర్తుతెచ్చుకో.. సంవత్సరం క్రితం మన దేశం చచ్చిపోయి ఉండింది. ఇప్పుడు ప్రపంచంలోనే హాటెస్ట్ కంట్రీగా మారిపోయింది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

తుమ్మెద రెక్కల మీద మువ్వన్నెవిల్లుల ఆకాశం

జిహ్వకో రుచి.. మనిషికో షెఫ్‌

Updated Date - Aug 04 , 2025 | 10:42 AM