Share News

Donald Trump Claims: నేనే లేకుంటే భారత్‌పాక్‌ మధ్య అణు యుద్ధం జరిగేది

ABN , Publish Date - Aug 16 , 2025 | 02:45 AM

భారత్‌ పాకిస్థాన్‌ మధ్య వివాదాన్ని పరిష్కరించానని.. తానే లేకుంటే అణు యుద్ధమే జరిగేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యలు చేశారు....

Donald Trump Claims: నేనే లేకుంటే భారత్‌పాక్‌ మధ్య అణు యుద్ధం జరిగేది

న్యూయార్క్‌/వాషింగ్టన్‌, ఆగస్టు 15: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య వివాదాన్ని పరిష్కరించానని.. తానే లేకుంటే అణు యుద్ధమే జరిగేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యలు చేశారు. గురువారం వైట్‌హౌ్‌సలోని ఓవల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘ఆ సమయంలో భారత్‌-పాక్‌ విమానాలు గాల్లో లేచాయి. ఓ దశలో 6-7 విమానాలు కూలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అణ్వాయుధాలు ప్రయోగించుకునేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. అయితే మేం కలుగజేసుకొని సమస్యను పరిష్కరించాం. ఇలా గత 6 నెలల్లో 6 యుద్ధాలను ఆపాను’ అని అన్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని ప్రయత్నిస్తున్న ట్రంప్‌.. శుక్రవారం అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కూడా సులువుగానే ఆపవచ్చని భావించానని.. కానీ ఇప్పుడదే అత్యంత క్లిష్టంగా మారిందని చెప్పారు. ‘నేను అధ్యక్షుడిని కాకపోయుంటే పుతిన్‌ ఇప్పటికే ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునే వారని అనుకుంటున్నాను. కానీ.. నేను అధ్యక్షుడిని నాతో ఆయన గొడవ పడరు. జరగబోయే సమావేశం సజావుగా ముగుస్తుందని భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 16 , 2025 | 02:45 AM