Share News

Thailand PM Removal: థాయ్‌లాండ్‌ ప్రధాని ఔట్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:12 AM

థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రాపై ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం వేటు వేసింది. ..

Thailand PM Removal: థాయ్‌లాండ్‌ ప్రధాని ఔట్‌

  • పేటోంగ్టార్న్‌ షినవత్రాను తొలగించిన ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం

బ్యాంకాక్‌, ఆగస్టు 29: థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రాపై ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం వేటు వేసింది. ఆమెను పదవి నుంచి తొలగిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. పేటోంగ్టార్న్‌ నైతిక ప్రమాణాల ఉల్లంఘనకు పాల్పడినట్లు రుజువైందని పేర్కొంది. కంబోడియాతో సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో ఆ దేశ నేత హున్‌ సేన్‌తో మాట్లాడిన ఓ ఫోన్‌కాల్‌ ఆమె పదవికి ఎసరు తెచ్చింది. జూన్‌లో వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ లీక్‌ అయింది. ఆ కాల్‌లో హున్‌ సేన్‌ను పేటోంగ్టార్న్‌ ‘అంకుల్‌’గా సంభోదించారని, థాయ్‌ సీనియర్‌ మిలటరీ కమాండర్‌ను విమర్శించారని అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. అయితే ఆ తర్వాత తన వ్యాఖ్యలపై పేటోంగ్టార్న్‌ క్షమాపణలు చెప్పారు. కాగా, శ్రేత్త థావిసిన్‌ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పేటోంగ్టార్న్‌ షినవత్రా దాదాపు ఏడాది పాటు పదవిలో కొనసాగారు. థావిసిన్‌ను కూడా రాజ్యాంగ న్యాయస్థానమే పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు షినవత్రాపై వేటు నేపథ్యంలో ఆ దేశ పార్లమెంట్‌ కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 07:53 AM