Share News

Sunita Williams: సునీతను తీసుకువచ్చేందుకు నింగిలోకి ఫాల్కన్‌-9

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:04 AM

సునీతా విలియమ్స్‌తోపాటు ఐఎ్‌సఎ్‌సలో ఉన్న బచ్‌ విల్మోర్‌ను భూమికి తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్‌ఎక్స్‌ తలపెట్టిన క్రూ-10 మిషన్‌లో తొలి అడుగు విజయవంతంగా పడింది. ఈ మిషన్‌లో భాగంగా ఫాల్కన్‌9 రాకెట్‌.. డ్రాగన్‌ స్పేస్‌క్రా్‌ఫ్టతో భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4;33 గంటలకు కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.

Sunita Williams: సునీతను తీసుకువచ్చేందుకు నింగిలోకి ఫాల్కన్‌-9

వాషింగ్టన్‌, మార్చి 15 : దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)లోనే ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అతి త్వరలో భూమికి తిరిగి రానున్నారు. సునీతా విలియమ్స్‌తోపాటు ఐఎ్‌సఎ్‌సలో ఉన్న బచ్‌ విల్మోర్‌ను భూమికి తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్‌ఎక్స్‌ తలపెట్టిన క్రూ-10 మిషన్‌లో తొలి అడుగు విజయవంతంగా పడింది. ఈ మిషన్‌లో భాగంగా ఫాల్కన్‌9 రాకెట్‌.. డ్రాగన్‌ స్పేస్‌క్రా్‌ఫ్టతో భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4;33 గంటలకు కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ స్పేస్‌క్రా్‌ఫ్టలో మెక్‌క్లెయిన్‌, నికోల్‌ ఆయర్స్‌, టకుయా ఒనిషీ, కిరిల్‌ పెస్కోవ్‌ అనే నలుగురు వ్యోమగాములు ఉన్నారు. వీరు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఐఎ్‌సఎ్‌సకు చేరుకుంటారు. ఐఎ్‌సఎ్‌సలో ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న బాధ్యతలను కొత్తగా వచ్చిన బృందంలోని వారికి అప్పగించిన తర్వాత సునీత, విల్మోర్‌ అదే డ్రాగన్‌ స్పేస్‌క్రా్‌ఫ్టలో భూమికి తిరుగు ప్రయాణమవుతారు. మరోవైపు, స్టార్‌షిప్‌ రాకెట్‌ ద్వారా 2026 చివరిలో అంగారక యాత్ర చేపట్టనున్నట్లు స్పేస్‌ ఎక్స్‌ సీఈవో మస్క్‌ ప్రకటించారు. అందులో టెస్లాకు చెందిన మానవరూప ‘రోబోట్‌ ఆప్టిమస్‌’ ఉంటుందని చెప్పారు. 2029లో మానవ సహిత యాత్ర ఉంటుందన్నారు.


ఇవి కూడా చదవండి..

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:04 AM