Share News

Shashi Tharoor: భారతీయులను చంపేసి తప్పించుకోగలం.. అనుకునే రోజులు పోయాయి: థరూర్‌

ABN , Publish Date - May 26 , 2025 | 02:11 AM

కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ భారత సరిహద్దులు దాటి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై భారతదేశం ఐక్యంగా ఉందని, పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ స్థాయిలోExpose చేయడానికి ఆయన నేతృత్వంలోని బృందం అమెరికా పర్యటనకు వెళ్లింది.

Shashi Tharoor: భారతీయులను చంపేసి తప్పించుకోగలం.. అనుకునే రోజులు పోయాయి: థరూర్‌

న్యూయార్క్‌, మే 25: భారత సరిహద్దులు దాటి, భారతదేశంలో దాడులు చేసి, భారత పౌరులను చంపేసి తప్పించుకోగలం అని పాకిస్థాన్‌లో కూర్చున్న వాళ్లు ఆలోచనలు చేసే రోజులు పోయాయని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ అన్నారు. భారత పౌరులను చంపిన వారు ఎవరైనా తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందేనన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌తో ఇది స్పష్టమైందని, ఇకముందు ఉగ్రవాదులు చెల్లించాల్సిన మూల్యం ఇంకా ఇంకా పెరుగుతుందని హెచ్చరించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరిని ఎండగట్టడం కోసం శశిథరూర్‌ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ఆదివారం అమెరికాకు వెళ్లింది. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో భారత సంతతి ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో థరూర్‌ మాట్లాడారు. తాను ప్రభుత్వంలో భాగస్వామిని కానని, ప్రతిపక్షంలో ఉన్నానని గుర్తు చేసిన ఆయన.. ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఐక్యంగా ఉందన్న సందేశమిచ్చారు. భారత్‌ ఎప్పుడూ పాకిస్థాన్‌పై దాడులకు దిగలేదని, వారు దాడి చేస్తేనే ప్రతిస్పందించిందని గుర్తు చేశారు. ముంబై, ఉరీ, పుల్వామా ఉగ్ర దాడులను గుర్తు చేశారు. కాగా, అమెరికా పర్యటన సందర్భంగా థరూర్‌ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం 9/11దాడుల స్మారకాన్ని సందర్శించింది. మరోవైపు, ఉగ్ర ముఠాలు అమాయక ప్రజలను హత్య చేసి మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. ఒవైసీ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం బహ్రెయిన్‌లో పర్యటించింది.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 02:11 AM