Share News

Russia: ఉక్రెయిన్‌పై 365 క్షిపణులు డ్రోన్లతో రష్యా దాడి

ABN , Publish Date - May 26 , 2025 | 03:07 AM

రష్యా ఉక్రెయిన్‌పై భారీ మిసైళ్ల, డ్రోన్ల దాడి నిర్వహించింది. ఉక్రెయిన్‌లో 12 మంది మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు, 80 భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది.

Russia: ఉక్రెయిన్‌పై 365 క్షిపణులు డ్రోన్లతో రష్యా దాడి

12 మంది మృతి, 70 మందికి గాయాలు

మాస్కో, కీవ్‌, మే 25: ఉక్రెయిన్‌పై రష్యా మరోమారు భీకర దాడి జరిపింది. ఉక్రెయిన్‌కు చెందిన సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా 367 మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్‌ ప్రయోగించిన 110 డ్రోన్లను కూల్చేశామని కూడా మాస్కో తెలిపింది. మరోవైపు రష్యా దాడుల్లో తమ దేశానికి చెందిన 12 మంది మృతిచెందారని, 70 మంది గాయపడ్డారని, 80 భవనాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్‌ వెల్లడించింది. రాజధాని కీవ్‌ సహా మొత్తం 30 నగరాలు, గ్రామీణ ప్రాంతాలపై రష్యా దాడులకు పాల్పడిందని తెలిపింది. రష్యా ప్రయోగించిన 45 మిసైళ్లను, 266 డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 03:07 AM