Pakistan: పాక్ అధ్యక్షుడు జర్దారీ ఉద్వాసనకు అవకాశాలు.. సైనిక తిరుగుబాటుపై ఉహాగానాలు
ABN , Publish Date - Jul 06 , 2025 | 09:58 PM
1977లో పాక్ సైనిక తిరుగుబాటు జరిగి జూలై 5వ తేదీకి 47 ఏళ్లు అయిన నేపథ్యంలో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వినిపిస్తున్నాయి.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మరోసారి రాజకీయ కల్లోలం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక మీడియా విశ్వసనీయ కథనాల ప్రకారం..సైనిక తిరుగుబాటు అనివార్యం కావచ్చని, ఇది దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఉద్వాసనకు దారితీయవచ్చని తెలుస్తోంది. 1977లో సైనిక తిరుగుబాటు జరిగి జూలై 5వ తేదీకి 47 ఏళ్లు అయిన నేపథ్యంలో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
జర్దారీని తొలిగించేందుకు జనరల్ ఆసిమ్ మునీర్ వ్యూహరచన చేస్తున్నట్టు పాకిస్థాన్ పాత్రికేయుడు సైయద్ తెలిపారు. అయితే జర్దారీ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటారా? బలవంతంగా ఆయనకు తొలగిస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ పరిణామాల వెనుక షరీఫ్ కుంటుంబ పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
నిమిషాల్లో భూమి మాయం, 51మంది మృతి, 27మంది బాలికలు గల్లంతు
ఆర్థిక, రాజకీయ పతనం వల్లే మైక్రోసాఫ్ట్ ఔట్..!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి