Share News

Pakistan: పాకిస్థాన్‌లో రైలు హైజాకర్ల హతం

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:08 AM

పాకిస్థాన్‌లో హైజాక్‌కు గురైన జాఫర్‌ ఎక్స్‌ప్రె్‌సను విడిపించేందుకు చేపట్టిన సైనిక చర్య ముగిసిందని పాకిస్థాన్‌ ఆర్మీ ప్రకటించింది.

Pakistan: పాకిస్థాన్‌లో రైలు హైజాకర్ల హతం

కరాచీ, మార్చి 12: పాకిస్థాన్‌లో హైజాక్‌కు గురైన జాఫర్‌ ఎక్స్‌ప్రె్‌సను విడిపించేందుకు చేపట్టిన సైనిక చర్య ముగిసిందని పాకిస్థాన్‌ ఆర్మీ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తంగా 33 మంది హైజాకర్లను హతమార్చి వారి చెరలో ఉన్న 346 మంది బందీలను విడిపించినట్లు వెల్లడించింది. ఈ ఉదంతంలో 21 మంది ప్రయాణికులు, 28 మంది సైనికులు మృతి చెందినట్లు వెల్లడించింది. బలోచిస్థాన్‌ ప్రావిన్సులోని క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న రైలును మంగళవారం బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Mar 13 , 2025 | 06:08 AM